Asianet News TeluguAsianet News Telugu

వరదల్లో హీరోయిన్.. మాకెవరి సాయం అక్కర్లేదు!

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. వరదల వల్ల ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రజలు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ మలయాళీ నటి మంజు వారియర్ హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మంజు వారియర్ ని క్షేమంగా తీసుకురావాలని ఆమె సోదరుడు ప్రభుత్వాన్ని కూడా రిక్వస్ట్ చేశాడు. 

Film Star Manju Warrier, Crew To Stay At Own Risk denaids govt help
Author
Hyderabad, First Published Aug 21, 2019, 9:25 PM IST

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. వరదల వల్ల ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రజలు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ మలయాళీ నటి మంజు వారియర్ హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మంజు వారియర్ ని క్షేమంగా తీసుకురావాలని ఆమె సోదరుడు ప్రభుత్వాన్ని కూడా రిక్వస్ట్ చేశాడు. మంజు వారియర్ తో పాటు 35 మంది చిత్ర సభ్యులు ఓ షార్ట్ ఫిలిం ని చిత్రీకరించేందుకు అక్కడకు వెళ్లారు. 

వీరంతా చత్రు అనే ప్రాంతంలో వరదల్లో చిక్కుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందు చర్యలు చేపడుతోంది. కానీ నటి మంజు వారియర్ మాత్రం ప్రభుత్వ సహాయ చర్యలని నిరాకరించినట్లు తెలుస్తోంది. చిత్ర బృందంతో ఆమె మనాలి వెళ్లాల్సి ఉంది.  ఆ రోడ్డు వరదతో దెబ్బతినడంతో వాళ్ళు అక్కడే నిలిచిపోయారు. 

మరమ్మత్తులు జరిగాక తాము మనాలి వెళతామని ఎలాంటి సహాయ చర్యలు వద్దని మంజు వారియర్ అంటున్నారు. తమకేదైనా ప్రమాదం జరిగితే అది ప్రభుత్వ బాధ్యత కాదని మంజు వారియర్ తెలిపింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నించినా వద్దంటున్నారని అధికారులు పేర్కొన్నారు. 

దీనితో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రంగంలోకి దిగి వారిని ఎలాగైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios