Asianet News TeluguAsianet News Telugu

SivaSankar Master Death : దేవుడి ప్లాన్లు వేరే వున్నాయనుకుంటా.. శివశంకర్ మాస్టర్ మరణంపై సినీ ప్రముఖుల సంతాపం

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ (sivasankar master) మాస్టర్ కరోనాతో (coronavirus) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. 

film fraternity condolence message to sivasankar master death
Author
Hyderabad, First Published Nov 28, 2021, 9:58 PM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ (sivasankar master) మాస్టర్ కరోనాతో (coronavirus) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. శివశంకర్ మాస్టర్ మరణవార్తను తెలుసుకున్న సోనూసూద్ (sonusood) దిగ్భ్రాంతికి గురయ్యారు. శివశంకర్ మాస్టర్ మరణవార్తతో తన గుండె ముక్కలైందని.. తనకు చేతనైనంతలో ఆయనను కాపాడేందుకు ప్రయత్నించానని, కానీ దేవుడి ప్లాన్లు వేరే వున్నాయంటూ ట్వీట్ చేశారు. ఆయను సినీ పరిశ్రమ మిస్ అవుతుందని.. ఈ విపత్కర పరిస్ధితుల్లో శివశంకర్ మాస్టర్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్నివ్వాలని సోనూసూద్ ప్రార్ధించారు. 

ALso Read:Sivasankar Master Death: శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. కరోనా బారినపడి, మృత్యువుతో పోరాడి ఓడిన ప్రతిభాశాలి

అటు శివశంకర్ మాస్టర్ మరణవార్తపై మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) కూడా సంతాపం తెలిపారు. ‘శివ శంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివ శంకర్ మాస్టర్ ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు. ఆయన నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం, ముఖ్యంగా ఖైదీ సినిమాకు సలీం మాస్టర్ అసిస్టెంట్ గా నాకు చాలా స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారు, అప్పుడు మొదలైన మా స్నేహం చాలా బలపడింది. తర్వాత కూడా ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. చరణ్ బ్లాక్ బస్టర్ అయిన మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శి‌వశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ కూడా పొందారు. ఆయనను చివరిగా ఆచార్య సెట్స్ లో కలిశాను, అదే చివరి సారి అవుతుందని అస్సలు ఊహించలేదు, ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు అనిపిస్తోంది. ఆయన మృతి కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు' అని చిరంజీవి పేర్కొన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్. 

శివ శంకర్ మాస్టర్ మృతి పట్ల నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివ శంకర్ మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.  ‘శివ శంకర్ మాస్టర్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయనతో కలిసి కొన్ని చిత్రాలకు పని చేయడం జరిగింది. శివ శంకర్ మాస్టర్ అకాల మృతి పట్ల చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.

అలాగే జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) కూడా శివశంకర్ మాస్టర్‌ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కన్నుమూయడం బాధాకరమని.. ఆసుపత్రిలో కోలుకుంటారని భావించానని పవన్ అన్నారు. శాస్త్రీయ నృత్యంలో పరిజ్ఞానాన్ని మేళవించారని.. రామ్‌చరణ్ మగధీర సినిమాలో శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు అందించిన పాట ప్రేక్షకులకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా జాతీయ స్థాయి  పురస్కారాన్ని పొందిందని పవన్ గుర్తుచేశారు. వందల చిత్రాల్లోని పాటలకు తన కళ ద్వారా నృత్యరీతులు అందించిన శివశంకర్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios