గంజాయి, ఇతర మత్తు పదార్థాలు  వాడుతు పట్టపడ్డాడు ప్రముఖ దర్శకులు. తన ప్లాట్ లో హైబ్రీడ్ గంజాయి తో దొరికిపోయిన ఆ సెలబ్రిటీలని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. 

ప్రముఖ మలయాళ దర్శకులు ఖాలిద్ రెహమాన్, అష్రఫ్ హంజా హైబ్రిడ్ గంజాయితో కొచ్చిలో అరెస్టయ్యారు. వాడటానికి సిద్ధం అవుతుండగానే ఎక్సైజ్ అధికారులు వీళ్ళని పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు జరిగిన మెరుపుదాడిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రహస్య సమాచారం ఆధారంగా ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. ఫ్లాట్‌కి వెళ్ళినప్పుడు దర్శకులు ఖాలిద్ రెహమాన్, అష్రఫ్ హంజా, వాళ్ళతో ఉన్న షాలిఫ్ ముహమ్మద్ గంజాయి వాడటానికి సిద్ధమవుతున్నట్టు ఎక్సైజ్ తెలిపింది.

గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వాడటానికి రోజు ఆ ఇంటికి వారు వచ్చేవారని, పక్కా సమాచారంతోనే, ఆధారాలతో సహా.. ఫ్లాట్‌పై దాడి చేసినట్టు ఎక్సైజ్ అధికారులు చెప్పారు. దర్శకులకు మత్తు పదార్థాలు సరఫరా చేసిన వారి గురించి ఆధారాలు దొరికాయని, విచారణ జరుగుతుందని, సినిమా రంగంలో చాలా మంది మత్తు పదార్థాలు వాడుతున్నట్టు సమాచారం ఉందని, దానిపై కూడా విచారణ జరుపుతామని ఎక్సైజ్ వెల్లడించింది. ఈ సంఘటన మలయాళ పరిశ్రమలో మాత్రమే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. 

రహస్య సమాచారం ఆధారంగా ఎక్సైజ్ స్పెషల్ స్క్వాడ్ ఆదివారం తెల్లవారుజామున చేసిన దాడిలో దర్శకులతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయితో కొచ్చి గోశ్రీ బ్రిడ్జి దగ్గర ఉన్న ఫ్లాట్‌లో తెల్లవారుజామున రెండు గంటలకు వీళ్ళని పట్టుకున్నారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి, బెయిల్‌పై విడుదల చేశారు. వాణిజ్యపరంగా ఎక్కువ మొత్తంలో గంజాయి దొరక్కపోవడంతో బెయిల్ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఆలప్పుళ జిమ్ఖానా, ఉండ, తల్లూమాల, అనురాగ కరికిన్ వెళ్ళం, లవ్ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేశాడు ఖాలిద్ రెహమాన్. తమాషా, భీమ వంటి సినిమాల దర్శకుడు అష్రఫ్ హంజా. తల్లూమాల సినిమాకి సహ రచయిత కూడా.

കൊച്ചിയിൽ ഹൈബ്രിഡ് കഞ്ചാവുമായി സംവിధായകർ പിടിയിൽ