సోషల్ మీడియా లో కేవలం సినిమా ల గురించి మాట్లాడటమే కాదు...సామాన్యులకు చేరేలా సందేశాలు ఇవ్వచ్చుని సూపర్ స్టార్ మహేష్ బాబు గమనించారు. నేషనల్ గర్ల్, చైల్డ్ దినోత్సవం సందర్భంగా మెసేజ్ తో కూడిన పిలుపును మహేష్ ఇచ్చాడు.
సోషల్ మీడియా లో కేవలం సినిమా ల గురించి మాట్లాడటమే కాదు...సామాన్యులకు చేరేలా సందేశాలు ఇవ్వచ్చుని సూపర్ స్టార్ మహేష్ బాబు గమనించారు. నేషనల్ గర్ల్, చైల్డ్ దినోత్సవం సందర్భంగా మెసేజ్ తో కూడిన పిలుపును మహేష్ ఇచ్చాడు. తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఆయన సందేశాన్ని పోస్ట్ చేసి, తన అభిమానులను ఎలర్ట్ చేసారు.
మహిళల పై మనదేశంలో వివక్ష ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం .. ఒక పక్క ఈ వివక్షను పోగొట్టడానికి ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. ఈ విషయమై తనవంతు భాధ్యతగా మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా సందేశం పోస్ట్ చేసి జనాల్లో ఎవేర్ నెస్ తెచ్చే ప్రయత్నం చేసారు. ఏ హీరో కూడా ఈ విషయమై మాట్లాడలేదు..దాంతో మహేష్ ని అందరూ మెచ్చుకుంటున్నారు.
మహేష్ ట్వీట్ చేస్తూ... చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వివక్ష ఎక్కువగా ఉంది. ఆడపిల్లల పై ఈ వివక్షను పోగొట్టాలి, ఈ విషయంలో ప్రతిఒక్కరిలో మార్పు వచ్చేలా మనమందరం మన ప్రయత్నం చెయ్యాలని మహేష్ బాబు కోరాడు.
ఇక కెరీర్ విషయానికి వస్తే ..కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘భరత్ అనే నేను’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది.
ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట చిత్రయూనిట్. ఆ తర్వాత కొన్ని కీలక సన్నివేశాల కోసం అబుదాబీ ఫ్లైట్ ఎక్కుతారట ‘మహర్షి’ టీమ్. అంతటితో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని టాక్.
పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్ర చేస్తున్నారు. మహేష్ బియర్డ్ లుక్‌లో కనిపించబోతోన్న ‘మహర్షి’ చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
