సాయి తేజ వంటి హీరోలపై మరీ భారీ బడ్జెట్ లు పెట్టి సెట్స్ వేయటానికి నిర్మాతలు ఆసక్తి చూపరు. ఎందుకంటే అంతకు తగ్గ బిజినెస్ జరగదు కాబట్టి. కానీ సుకుమార్ వంటి దర్శకులు సీన్ లోకి ఎంటరై, ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుందని హామీ ఇస్తే నిర్మాతకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు సాయి తేజ కొత్త చిత్రానికి ఓ భారీ సెట్ వేయబోతున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే...

హిట్, ఫ్లాఫ్ కు  సంభందం లేకుండా ఎప్పటికప్పుడు విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌. వరుస ఫ్లాఫ్ ల తర్వాత గతేడాది ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజూ పండగే’చిత్రాలతో కాస్త రిలీఫ్ అయ్యారు. సక్సెస్ దారిలో పడ్డారు. ప్రస్తుతం సాయి నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు సాయి తేజ్‌. 

సాయి తేజ ఈ సారి మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. చక్రంలో నుంచి ఒంటి కన్నుతో ఓ వ్యక్తి చూస్తున్నట్లు విడుదల చేసిన పోస్టర్‌ సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచుతోంది. ఈ చిత్రానికి సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా 70లలో జరుగుతుంది. ఈ సినమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఇందుకోసం ఫిక్షనల్ ఫారెస్ట్ విలేజ్ సెట్ నిర్మిస్తున్నాం అని డైరక్టర్ ఓ ఇంటర్వూలో చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇక ఫారెస్ట్ సెట్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే సుకుమార్ ...సీన్ లో ఉండటంతో నిర్మాతలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక బృందం, టైటిల్‌ ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

‘‘సరికొత్త జానర్‌లో సినిమాలు చేయడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అది కూడా నాకెంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్‌ గారితో కలిసి పనిచేయడం మరింత ప్రత్యేకం. #SDT15 మిస్టరీ థ్రిల్లర్‌ను ఎస్‌వీసీసీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు’’ -ట్విటర్‌లో సాయి ధరమ్‌ తేజ్‌

దర్సకుడు కార్తీక్‌ దండు గతంలో సుకుమార్ దగ్గర దర్శకత్వం విభాగంలో పనిచేసారు. త్వరలోనే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ప్రకటించనున్నారు. సాయి ధరమ్ తేజ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్, దేవకట్టా దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నారు.