Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ కు జ్వరం..అందుకే షెడ్యూల్ కాన్సిల్ ?

ఈ నెలలో ఉండాల్సిన షెడ్యూల్ కాన్సిల్ అయ్యిందని సమాచారం. అందుకు కారణం వారం క్రితం ప్రభాస్ కు హై ఫీవర్ వచ్చిందని తెలుస్తోంది. 

Feaver to Prabhas, late to maruthi Movie
Author
First Published Feb 7, 2023, 11:49 AM IST


ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే వీటితో పాటు ప్రభాస్ మరో సినిమాకు మొదలెట్టారు. దర్శకుడు మారుతితో ఆయన ఓ హార్రర్ సినిమాను చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రభాస్ ఒక క్విక్ ప్రాజెక్ట్‌గా చేస్తున్నారు. కాగా ఈ సినిమా కొత్త  షెడ్యూల్ హైద‌రాబాద్‌లో  ప్రారంభం కావాలి. ఈ షెడ్యూల్‌లో ప్ర‌భాస్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు మారుతి చిత్రీక‌రించ‌నున్న‌ారు. అయితే ఈ నెలలో ఉండాల్సిన షెడ్యూల్ కాన్సిల్ అయ్యిందని సమాచారం. అందుకు కారణం వారం క్రితం ప్రభాస్ కు హై ఫీవర్ వచ్చిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆయన కులాసాగానే ఉన్నారని తెలుస్తోంది. 

ఇక  ప్ర‌భాస్ సినిమా కోసం భారీ వ్య‌యంతో ఓ పాత‌కాలం నాటి థియేట‌ర్ సెట్‌ను చిత్ర యూనిట్ వేసిన‌ట్లు వినికిడి. ఈ సెట్‌లోనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగ‌నుంద‌ని చెబుతున్నారు. ఇక్కడే ఎక్కువ శాతం షూటింగ్  కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టించ‌నున్న‌ట్లు తెలిసింది. ప్ర‌భాస్‌, మారుతి సినిమాకు రాజా డీల‌క్స్ అనే పేరును ప‌రీశీల‌న‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం టైటిల్‌తో పాటు షూటింగ్‌, క్యాస్టింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌పై ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేయ‌లేదు. లిమిటెడ్ బ‌డ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

 ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ప‌లు పాన్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు. ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో స‌లార్ సినిమా రూపొందుతోంది. అలాగే రామాయ‌ణ గాథ ఆధారంగా ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ సినిమా ఈ  ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios