బాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన ఫరాన్ అక్తర్ తాజాగా సోషల్ మీడియాలో విమర్శల పాలయ్యాడు. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి సాధ్వి ప్రగ్యాసింగ్ అనే బిజెపి అభ్యర్థి పోటీ చేశారు. ఆయన్ని విమర్శిస్తూ ఫరాన్ అక్తర్ చేసిన ట్వీట్ నవ్వులపాలవుతోంది. ఇంతకీ ఏంజరిగిందంటే.. గాంధీని హ్యత చేసిన నాథురాం గాడ్సే దేశభక్తి కలవాడని ప్రగ్యాసింగ్ ఇటీవల ప్రశంసించాడు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫరాన్ అక్తర్ ట్వీట్ చేశాడు. 

గాడ్సేకి మద్దతు తెలుపుతున్న ప్రగ్యాసింగ్ కు ఓటు వేయొద్దని ఫరాన్ అక్తర్ ఓటర్లని కోరాడు. ప్రియమైన భోపాల్ ప్రజలారా.. మీ  నగరాన్ని మరో గ్యాస్ ట్రాజిడీ నుంచి రక్షించుకొంది. ప్రగ్యాసింగ్ కు నో చెప్పండి. ద్వేషంభావం కలవారికి ఓటు వేయొద్దు. ప్రేమ స్వభావం కలవారిని ఎన్నుకోండి అని త్వేట్ చేశాడు. 

ఫరాన్ అక్తర్ ప్రగ్యాసింగ్ పై విమర్శలు చేయొచ్చు. కానీ భోపాల్ లో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి.ఈ నెల 12న 6వ దశ పోలింగ్ లో భాగంగా మధ్య ప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. నేడు చివరిదైన 7వ దశ కూడా ముగిసింది. ఫరాన్ అక్తర్ ఎన్నికలన్నీ ముగిశాక నిద్ర మేల్కొన్నాడు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఫరాన్ అక్తర్ 2024 ఎన్నికల కోసం ఇప్పుడే ప్రచారం ప్రారంభించినట్లు ఉన్నారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఫరాన్ అక్తర్ మీ ఇంట్లో వెంటనే ఇంటర్ నెట్ మార్చుకోండి.. మీరు చేసిన ట్వీట్ 10 రోజుల తర్వాత వస్తోంది అంటూ మరో నెటిజన్ సెటైర్ వేశాడు.