ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు యూవీ క్రియేషన్స్ దిగివచ్చింది. అభిమానుల కోరిక మేరకు ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ను అందించింది. ఇప్పటికే మూవీ నుంచి సాంగ్స్, ట్రైలర్, టీజర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి.. తాజాగా స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్..  

ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు యూవీ క్రియేషన్స్ దిగివచ్చింది. అభిమానుల కోరిక మేరకు ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ను అందించింది. ఇప్పటికే మూవీ నుంచి సాంగ్స్, ట్రైలర్, టీజర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి.. తాజాగా స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్.. 

ప్రభాస్‌(Prabhas) హోం బ్యానర్‌ `యూవీ క్రియేషన్స్`(UV Creation)పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘రాధే శ్యామ్’నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఏకంగా `#BoycottUvCreations` అంటూ ట్రోల్స్ చేస్తూ మండిపడ్డారు. ఈ యాష్‌ ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేశారు. Prabhasకి తెరవెనుక అతిపెద్ద విలన్‌ యూవీ క్రియేషనే అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగులో వరెస్ట్ బ్యానర్‌ ఏదో చెప్పండి అంటూ కూడా కాంటెస్ట్ పోట్టారు. అయితే ‘రాధే శ్యామ్ మూవీ ఎప్పుడో జనవరిలోనే రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎండ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్... దాదాపు నెల రోజులుగా మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తమ నిరసన తెలిపారు. 

ఇదంతా గమనించిన యూవీ క్రియేషన్స్ ఫ్యాన్స్ ను కూల్ చేసేందుకు తాజాగా అప్డేట్ అందించింది. రాధే శ్యామ్ నుంచి రేపు స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పింది యూవీ క్రియేషన్స్.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కొత్త సాంగ్ ప్రొమోను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ.. ‘ప్రేమ మధురానుభూతులను ఆవిష్కరించండి! మ్యూజికల్ ఆఫ్ ఏజెస్ కోసం సిద్ధం కండి’ అంటూ నోట్ రాసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఎర్రటి హార్ట్ బెలూన్ ను పట్టుకుని చర్చిలో నిల్చున్నట్లు ఉన్న పోస్టర్‌లో ప్రభాస్ అట్రాక్టివ్ గా ఉన్నారు. ఒక పాపను చూస్తూ బెలూను అందించే ఈ పోస్టర్ క్లాస్ లుక్ ను సంతరించుకుంది. ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ఈ చిత్రం మార్చి 11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 20 వేల థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. యూవీక్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రేమకి, విధికి మధ్య సాగే ఫైటింగ్‌ నేపథ్యంలో ఈచిత్ర కథ సాగుతుందని టాక్‌.