సినిమా స్టార్స్ కనిపిస్తే చాలు అభిమానులకు ఉత్సాహంతో గంతులేయటం సహజంగా మారింది. ఇటీవల కాలంలో అభిమానం హద్దులు దాటిపోయిన సందర్భాలు ఎన్నో చూసాము. ఎయిర్ పోర్ట్ లో అభిమాని ముద్దు కావాలని అడగటం చూశాం. అత్యుత్సాహంతో వారికి దెబ్బలు తగిలిన పట్టించుకోని సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

 

 

ఇప్పుడు లేటెస్ట్ గా హీరోయిన్ సమంతకు అటువంటి చేదు అనుభవమే ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో జరిగింది. ఒక మొబైల్ షోరూమ్ ఓపెనింగ్ కు వెళ్ళిన సమంతకు అక్కడి అభిమానులు ఆమె పట్ల చూపించిన పిచ్చి అభిమానంతో ఆమె మైండ్ బ్లాంక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

 

 

తెలుస్తున్న సమాచారం మేరకు సమంత కోసం అనంతపురంలో అభిమానులు ఎగబడ్డారు. ఓ అభిమాని సమంతని చూడాలనే మితిమీరిన ఉత్సహంతో దూసుకు రావడంతో అక్కడ తోపులాట జరగడంతో ఆ అభిమానిని ఆపే క్రమంలో పోలీస్ లు అతడిపై లాఠీ ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో సమంత మనస్తాపంతో ఆ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని తెలుస్తోంది.

 

చాలామంది సెలెబ్రెటీలు తమను అభిమానించే కన్నా తమ అభిమానులను వారి జీవితాల గురించి వారి తల్లి తండ్రుల గురించి ఆలోచించండి అని అనేక సార్లు ఓపెన్ గా చెపుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయాలను పట్టించుకునే తీరికా ఓపిక అభిమానులకు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరగడం సర్వసాధారణంగా మారింది. సినిమా స్టార్స్ కటౌట్లకు పాలతో అభిషేకాలు చేసే పరిస్థుతులు ఉన్నంత కాలం సెలెబ్రెటీలు ఎంత చెప్పినా ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి అనుకోవాలి.