సూపర్ స్టార్ మహేష్ బాబు.. సుకుమార్ తో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా వర్కవుట్ కావడం లేదని మహేష్ చెప్పడంతో సుకుమార్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుందేమో అనుకున్నారు కానీ అభిమానులు మాత్రం ఆ సినిమా పోతేపోయింది.. పూరిజగన్నాథ్ తో సినిమా చేయాలని మహేష్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. 

మహేష్ పెట్టిన ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ పూరిజగన్నాథ్ ని ట్యాగ్ చేస్తూ పూరితో సినిమా చేయాలని అడుగుతున్నారు. మహేష్ మాస్ సినిమా తీసి చాలా రోజులైందని గుర్తు చేస్తూ పూరికి మరో ఛాన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారు. గతంలో మహేష్ తో 'పోకిరి', 'బిజినెస్ మెన్' సినిమాలు చేసిన పూరి మరోసారి అతడిని డైరెక్ట్ చేయాలనుకున్నారు.

'జనగణమన' అనే సినిమాను మహేష్ తో తీయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ సినిమా సెట్స్ పైకి రాలేదు. ఇటీవల పూరి ఈ సినిమాలో నుండి ఒక డైలాగ్స్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

అది ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చడంతో అప్పటినుండి మహేష్ ని ఈ సినిమా చేయాలని సోషల్మీడియాలో ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం మహేష్ 'మహర్షి'ని పూర్తి చేసి ఆ తరువాత అనీల్ రావిపూడితో సెట్స్ పైకి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు.