Asianet News TeluguAsianet News Telugu

దర్శకుడు హరీష్ శంకర్ కంటే పవన్ ఫ్యాన్స్ ఎక్కువ ఫీల్ అవుతున్నారట!


పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. 2024 ఎన్నికలకు సిద్దమవుతున్న ఆయన కేవలం రెండు చిత్రాలు మాత్రమే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. భవదీయుడు భగత్ సింగ్ దాదాపు వాయిదాపడ్డట్లే. ఈ విషయంలో దర్శకుడు హరీష్ కంటే... ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 

fans not happy with holding pawan kalyan harish shankar bbs movie
Author
Hyderabad, First Published Jun 26, 2022, 1:07 PM IST

2019 సార్వత్రిక ఎన్నికలు పవన్ కళ్యాణ్ కి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. టీడీపీ నుండి బయటికి వచ్చిన జనసేన లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల్లో ఓటమి చవిచూశారు. జనసేన కేవలం ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకు పగడ్బందీగా పవన్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ నుండి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. పవన్ బస్సు యాత్ర సుదీర్ఘంగా 6 నెలలు సాగనున్నట్లు సమాచారం. యాత్ర ముగింపు తర్వాత కూడా ఆయన జనాల్లో ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారు. 

టీడీపీతో పొత్తుకు వెళ్లినా వెళ్లకున్నా.. జనసేన కంటూ జనాల్లో ఓ గుర్తింపు వచ్చేలా ఆయన పావులు కదుపుతున్నారు. దీని వలన హడావుడిగా ప్రకటించిన చిత్రాలు గందరగోళంలో పడ్డాయి. 2018లో సినిమాలకు శెలవన్న పవన్... 2019 ఎన్నికల ఫలితాల తర్వాత మనసు మార్చుకున్నారు. కమ్ బ్యాక్ ప్రకటించారు. వకీల్ సాబ్ చిత్రంతో పాటు దర్శకులు క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో చిత్రాలు ప్రకటించారు. ప్రకటించిన చిత్రాల్లో పవన్ పూర్తి చేసింది కేవలం వకీల్ సాబ్ మాత్రమే. 

మొదట ఒప్పుకున్న చిత్రాలు పక్కన పెట్టి త్వరగా పూర్తయ్యే రీమేక్స్ పై దృష్టి పెట్టాడు. భీమ్లా నాయక్ చక చకా పూర్తి చేసి వదిలారు. భీమ్లా నాయక్ తర్వాతైనా హరి హర వీరమల్లు షూటింగ్ వేగం పెంచి హరీష్ శంకర్ మూవీ స్టార్ట్ చేస్తారు అనుకుంటే అదీ జరగలేదు. అలాగే ఉన్న సమయాన్ని హరి హర వీరమల్లుకి కేటాయించి పూర్తి చేయకుండా సైలెంట్ గా వినోదయ సిత్తం రీమేక్ స్టార్ట్ చేశారు. మధ్యలో ఉన్న హరి హర వీరమల్లు భవిష్యత్తే అగమ్యగోచరంగా మారగా.. ఇక హరీష్ మూవీ లేనట్లే అని ఫ్యాన్స్ ఓ నిర్ణయానికి వచ్చారు. 

నిజానికి వారు ఎప్పటి నుండో కోరుకుంటున్న కాంబినేషన్ ఇది. అనుకోకుండా పదేళ్ల తర్వాత సెట్ అయ్యింది. గబ్బర్ సింగ్ రేంజ్ మూవీ హరీష్ నుండి వస్తుందని  ఆశలు పెట్టుకున్నారు. పైగా భవదీయుడు భగత్ సింగ్ టైటిల్, ఫస్ట్ లుక్ ఆకట్టుకున్నాయి. థియేటర్స్ లో చొక్కాలు చింపుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాదాపు ఈ ప్రాజెక్ట్ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్న హరీష్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios