సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు తన 48వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ తమ అభిమాన హీరో బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు తన 48వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ తమ అభిమాన హీరో బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అగ్ర హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు త్వరలో రాజమౌళి చిత్రంతో పాన్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్నారు. 

ఇటు సోషల్ మీడియాలో, అటు ఆఫ్ లైన్ లో మహేష్ బర్త్ డే సెలెబ్రేషన్ వైభవంగా జరుగుతున్నాయి. అయితే అభిమానులందు మహేష్ బాబు అభిమానులు వేరయా అనిపించే అద్భుత సంఘటన జరిగింది. మహేష్ బాబు కోసం ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ బర్త్ డే గిఫ్ట్ అందించారు. 

మహేష్ బాబు పేరుపై ఏకంగా అంతరిక్షంలో నక్షత్రాన్ని రిజిస్టర్ చేయడం విశేషం. దీనితో మహేష్ బౌ 48వ బర్త్ డేని ఫ్యాన్స్ ఎంతో ప్రత్యేకంగా మార్చేసారు. మహేష్ బాబు అభిమానులు చేసిన ఈఘనత చూసి టాలీవుడ్ సెలెబ్రటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ బాబుకి ఆయన అభిమానులు మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 

ఈ మేరకు మహేష్ బాబు అభిమానులు తమ హీరో పేరుపై రిజిస్టర్ చేసిన నక్షత్రం యొక్క సర్టిఫికెట్ కూడా పొందారు. ఈ సర్టిఫికెట్ లో ఆ నక్షత్రం వివరాలు ఉన్నాయి. స్టార్ రిజిస్టేషన్ సంస్థ ఈ మేరకు సర్టిఫికెట్ జారీ చేసింది. 

'RA: 12h 33m 29s  DEC: +69deg 47' 17.6'' కోఆర్డినేట్స్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ నక్షత్రానికి ఆయన పేరుని రిజిస్టర్ చేశారుమహేష్ బాబు క్రేజ్ అంతరిక్షానికి చేరింది అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. టాలీవుడ్ నుంచి గతంలో రాంచరణ్ పేరుపై కూడా నక్షత్రం రిజిస్టర్ అయింది. 

ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.