Asianet News TeluguAsianet News Telugu

మా హీరోని 'అంకుల్' అంటావా? హీరోయిన్ పై ఫ్యాన్స్ ఫైర్

ఇవి సోషల్ మీడియా రోజులు. సెలబ్రెటీల ప్రతీ చర్య ఇక్కడ ట్రోలింగ్ చెయ్యబడుతోంది.

Fans express outrage over Sara Ali Khan calling Shah Rukh Khan 'uncle'
Author
Hyderabad, First Published Apr 1, 2019, 11:48 AM IST

ఇవి సోషల్ మీడియా రోజులు. సెలబ్రెటీల ప్రతీ చర్య ఇక్కడ ట్రోలింగ్ చెయ్యబడుతోంది. తాజాగా ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ కు ఈ సిట్యువేషన్ ఎదురైంది.  అలవాట్లో పొరపాటుగా ఆమె  బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ను 'అంకుల్' అని పిలవటం ఫ్యాన్స్ కు మింగుడుపడటం లేదు. వాళ్ల ఇన్నర్ సర్కిల్స్ లో చిన్నప్పటి నుంచీ షారూఖ్ ని దగ్గర నుంచి చూసి అంకుల్ అని పిలవటం అలవాటైన ఆమె బయిట కూడా అలాగే సంభోదించింది. ఇప్పుడు నాలుక కరుచుకున్నా కామెంట్స్ ఆగే పరిస్దితి కనపడటం లేదు.

వివరాల్లోకి లోకి వెళ్తే  ఈ మధ్యన ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్స్  చాలామంది ఎప్పటిలాగే హాజరయ్యి హంగామా చేసారు.  ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ అనంతరం.. మీడియా ఇంట్రాక్షన్ జరిగింది. 

అందులో భాగంగా ఈ వేడుక గురించి ఒక రిపోర్టర్ సారా తో మాట్లాడుతూ " షారూఖ్ అంకుల్ తో కలిసి మానాన్నహోస్ట్ చేయడం నాకు చాలా నచ్చే విషయం" అంది. మా హీరోని అంకల్ అంటావా అంటూ షారూఖ్ అభిమానలు ఒక్కసారిగా హర్ట్ అయ్యి ఆమెపై ఫైర్ అయ్యారు.  ' ఏం...ఆయన్ని సర్ అని పిలవొచ్చు కదా.. అంకుల్ అని పిలవాలా' అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.  అయితే షారూఖ్ యాంటి ఫ్యాన్స్, సార్ ఫ్యాన్స్ మాత్రం సారాకు మద్దతుగా నిలిచారు. 

అంకుల్ అని పిలిస్తే తప్పేంటి...సారా వయసు 23.. షారూఖ్ వయసు 53 అయినప్పుడు ఆయనను అంకుల్ అని పిలవడంతో తప్పేముందని అన్నారు.  లెక్కేస్తే  సారా ఫాదర్ సైఫ్ కంటే షారూఖ్ పెద్దవాడని అనటం మొదలెట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios