కోలీవుడ్ స్టార్ హీరోల అభిమానుల మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉంటాయి. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అనుకుంటూ సోషల్ మీడియా వేదికగా గొడవలు పడుతుంటారు. ప్రత్యక్షంగా తలపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా అజిత్, విజయ్ అభిమానులు ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు. మరో రెండు రోజుల్లో విజయ్ పుట్టినరోజు ఉందనేలోపు మరోసారి ఫ్యాన్స్ వార్ తెర మీదకు వచ్చింది. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు పురస్కరించుకొనిఆయన అభిమానులు కామన్ డీపీని డిజైన్ చేయించారు.

దీన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన కొద్దిసేపటికే అజిత్ ఫ్యాన్స్ లో కొందరు #June22VijayDeathDay అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. కొద్దినిమిషాల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్ చెన్నై ట్రెండ్స్ లో టాప్ లోకి వచ్చింది. వెంటనే కౌంటర్ గా విజయ్ ఫ్యాన్స్ #LongLiveThalapathy అనే ట్యాగ్ ని ట్రెండ్ చేశారు.

గతంలో కూడా ఇలానే విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఇద్దరు హీరోలు తమ అభిమానులను ఎంతగా కంట్రోల్ చేయాలని చూస్తున్నా.. ఆ  ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పుడు వీరి అభిమానం హద్దులు దాటి హీరోలను ఇబ్బందిపెట్టే వరకు వచ్చింది.