ఓ ప్రక్కన కరోనా ప్రభంజనంతో ప్రపంచం నానా రకాలుగా బాధలు పడుతోంది. భారత్ లోనూ లాక్ డౌన్ తో రకరకాల సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఇళ్లలో ఖాళీగా కూర్చున్నవాళ్లు ఫ్యాన్ వార్ మొదలెట్టేసారు. ట్విట్టర్ తెరిస్తే...డమ్మీ స్టార్ మహేష్ బాబు, రీమేక్ స్టార్ విజయ్ అనే హ్యాష్ ట్యాగ్స్ తో పోస్టులు విపరీతంగా కనపడుతున్నాయి. 

ఇది రెగ్యులర్ ట్వీట్ బ్యాచ్ ని కాస్తంత అయోమయంలో పడేస్తోంది. ఏం జరిగింది...ఎందుకూ ఫ్యాన్ వార్ స్టార్టైంది అనేది ఎవరికీ అర్దం కావటంలేదు. జనవరి ప్రారంభంలో ఇలాంటి ఫ్యాన్ వార్ ఒకటి స్టార్టై,ఆగింది. ఇప్పుడు మరోసారి మొదలైంది. తమిళ స్టార్ హీరో ఫ్యాన్స్ ..తీరి కూర్చిని ,తెలుగు స్టార్స్ ని టార్గెట్ చేయటం మొదలెట్టారు. అది ఏ స్దాయికి వెళ్లిందంటే బూతులు తిట్టుకునే దాకా. ఇప్పుడు మళ్లీ అలాంటి వారే స్టార్టైంది. ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పొరపాటున ఈ టైమ్ లో ఈ గొడవేంటి అని ఎవరైనా మధ్యలో దూరి గడ్డెట్టబోతే..వాళ్లని గడ్డి కరిపించేస్తున్నారు.

మహేష్ బాబు, తమిళ హీరో విజయ్ ఫ్యాన్స్ మధ్య వెర్బల్ వార్ ఓ రేంజిలో జరుగుతోంది. విజయ్ ఫ్యాన్స్ అంతా కూడా తమ ట్వీట్స్ కు హ్యాష్ ట్యాగ్ గా డమ్మీ సూపర్ స్టార్ మహేష్ అని పెట్టి వదులుతున్నారు. మహేష్ ఫ్యాన్స్ కూడా రేమేక్ స్టార్ విజయ్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మహేష్ ఫ్యాన్స్ మరో అడుగు ముందుకేసి, విజయ్ నటించిన చిత్రాల లిస్ట్ లో మహేష్ సినిమాల రీమేక్ ఏమున్నారో వాటి లిస్ట్ ప్రిపేర్ చేసి వదులుతున్నారు. ఈ విధంగా ఇద్దరి హీరోల మధ్యా ఫ్యాన్ వార్ జరుగుతోంది.