అందానికి చిరునామాగా ఐశ్వర్య పేరు మారుమ్రోగగా, ఆ సుందరిని దక్కించుకున్నాడు అభిషేక్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ అదృష్టానికి ప్రపంచమే కుళ్ళుకుంది. మరి ఇంత గొప్ప అందగత్తెకు ఫ్యాన్స్ నుండి పెళ్లి ప్రతిపాదనలు రావడం సర్వసాధారణం. 

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ భూమిపై తిరుగుతున్న దేవకన్యలా ఆమె అభిమానులు భావిస్తారు. దాదాపు రెండు దశాబ్దాలు ఆమె యువత కలల రాణిగా వెండితెరను ఏలారు. అందానికి చిరునామాగా ఐశ్వర్య పేరు మారుమ్రోగగా, ఆ సుందరిని దక్కించుకున్నాడు అభిషేక్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ అదృష్టానికి ప్రపంచమే కుళ్ళుకుంది. మరి ఇంత గొప్ప అందగత్తెకు ఫ్యాన్స్ నుండి పెళ్లి ప్రతిపాదనలు రావడం సర్వసాధారణం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


అయితే ఓ అభిమాని అభిషేక్ ముందే ఐశ్వర్యకు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. దానికి అభిషేక్ బచ్చన్ రియాక్షన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 2010లో అభిషేక్ తోపాటు ఐశ్వర్య కేన్స్ ఫెస్టివల్ కి హాజరయ్యారు. భర్తతో కలిసి ఆమె రెడ్ కార్పెట్ పై నడిచారు. ఆ వేడుకలో అభిమానులకు అభివాదం చేస్తుండగా, ఓ అభిమాని.. ఐశ్వర్యను ఉద్దేశిస్తూ, 'నన్ను పెళ్లి చేసుకో ఐశ్వర్య' అనే ప్లకార్డు ప్రదర్శించారు. అది చూసిన ఐశ్వర్య చిన్న స్మైల్ ఇవ్వడం జరిగింది. 


అభిషేక్ మాత్రం.. సదరు ఫ్యాన్ వైపు చూస్తూ... ఆమె నన్ను పెళ్లి చేసుకుంది మాన్' అంటూ రిప్లై ఇచ్చాడు. ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ వివాహం జరిగింది. వీరికి 2011లో ఓ అమ్మాయి జన్మించింది. ఆ పాపకు ఆరాధ్య అని నామకరణం చేశారు. 

View post on Instagram