రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటించగా వాటిలో ఆదిపురుష్ ఒకటి. మొదటిసారి పౌరాణిక చిత్రం చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ లో రాముని పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా అంచనాలున్నాయి.  ప్రభాస్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా ఆదిపురుష్ నిర్మితం కానుంది. 

వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో విలన్ రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ మూవీ ప్రకటన నాటి నుండి రామునిగా ప్రభాస్ ని ఊహిస్తూ అనేక ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వచ్చాయి. తాజాగా రాముని గెటప్ లో ప్రభాస్ ఫ్యాన్ మేడ్ ఎడిట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

సముద్ర తీరాన సిక్స్ ప్యాక్ బాడీతో సీరియస్ లుక్ లో రామునిగా ప్రభాస్ లుక్ చాలా సహజంగా ఉంది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.