టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ ఇలియానా ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. కొంత కాలం ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నిబోన్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉన్న ఈ బ్యూటీ అతనితో బ్రేకప్‌ కావటంతో డిప్రెషన్‌లోకి వెళ్లింది. దీంతో సినిమాలకు కూడా దూరమైంది. ఈ మధ్యే తేరుకొని తిరిగి సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ. తెలుగులో అమర్ అక్బర్ ఆంటొని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అయితే ఈ సందర్భంగా ఓ నెటిజెన్‌ అడిగిన ప్రశ్నతో ఇలియానాకు చిర్రెత్తుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చిన ఇలియానాను ఓ వ్యక్తి.. `నువ్వు ఇప్పుడు సింగిల్‌గా ఉన్నావా.. లేక రిలేషన్‌లో ఉన్నావా?` అంటూ ప్రశ్నించాడు. అయితే ఈ ప్రశ్నతో చిర్రెత్తుకొచ్చిన ఇలియానా ఓ జంతువు ఫోటోతో పాటు `పక్కవారి రిలేషన్‌షిప్స్ గురించి తెలుసుకోవాలనే కోరిక మనకు ఎక్కువ కదా` అంటూ రిప్లై ఇచ్చింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది పాగల్‌పంతి సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌ మూవీ ది బిగ్‌ బుల్‌లో నటిస్తోంది. హర్షద్‌ మెహతా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌  చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అజయ్‌ దేవగన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కుకీ గులాటీ దర్శకుడు.