వీరాభిమాని వికృత చేష్టలు.. సింగర్ ఏం చేసిందంటే!

First Published 8, Jun 2018, 1:16 PM IST
fan arrested for harassing Bollywood singer in Mumbai
Highlights

బీహార్ కు చెందిన రాజేష్ కుమార్ శుక్లా(౩౦) అనే వ్యక్తి  బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ పాలక్ ముచ్చల్

బీహార్ కు చెందిన రాజేష్ కుమార్ శుక్లా(౩౦) అనే వ్యక్తి  బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ పాలక్ ముచ్చల్ కు వీరాభిమాని. ఆమెను కలవడం కోసం బీహార్ నుండి ముంబై చేరుకున్నాడు. ఆమెను కలుసుకోవాలని చేసిన ప్రయత్నంలో ఇప్పుడు జైలుపాలయ్యాడు. ఎన్నో సినిమాలలో పాటలు పాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది పాలక్ ముచ్చల్.

ఆమెను ఎంతగానో ఆరాధించే రాజేష్ కుమార్ శుక్లా బీహార్ నుండి ముంబైకి వచ్చి ఆమె ఫోన్ నెంబర్, అడ్రెస్ లు ఎలాగోలా సంపాదించాడు. తరచూ ఆమెను కలవమని సందేశాలు పంపేవాడట. ఈ విషయాన్ని పాలక్ పట్టించుకోకపోవడంతో ఆమెకు అశ్లీల వీడియోలు, మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టాడు. తన వికృత చేష్టలతో విసిగిపోయిన సింగర్ తన తల్లితో కలిసి అంబోలీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. తన అభిమాన సింగర్ ను కలుసుకోవడం  కోసమే ఇలా చేసినట్లు అంగీకరించాడు శుక్లా.  
  

loader