సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ యాక్టర్స్ చాలా మంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అభిమానులను కలవరపెడుతోంది.  

ఈ మద్య ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు ముంచెత్తుతున్నాయి. అటుసిల్వర్ స్క్రీన్ తో పాటు.. స్మాల్ స్క్రీన్ యాక్టర్స్ చాలా మంది ఇప్పటికే కన్నుమూశారు. అభిమానులను కన్నీటిసంద్రంలో ముంచి వెళ్లిపోయారు. ఎంతో మంది బెస్ట్ యాక్టర్స్ ను  వెండితెర ఇప్పటికే కోల్పోయింది. ఇది  అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఈమధ్యే సౌత్ స్టార్ యాక్టర్ శరత్ బాబు మరణం సంబవించగా.. ఆ విషాదం మరువకముందే.. సౌత్ నుంచి మరో స్టార్ యాక్టర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

తాజాగా మాలీవుడ్ లో  మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ  నటుడు హరీష్ పెంగన్ (49) కన్నుమూశారు. కాలేయసంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన  మంగళవారం ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. చాలా కాలంగాకాలేయ సంస్యతో ఇబ్బంది పడుతున్నారు హరీష్. ఈక్రమంలో రీసెంట్ గా  హరీష్ కి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. హుటాహుటిన  కుటుంబ సభ్యులు ఈ నెల మొదటి వారం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ మార్పిడి అవసరం అని తెలిపారు. 

దాంతో ఎవరి కాలేయం సూట్ అవుతుందా అని చూడగా.. పెంగన్ సోదరి కాలేయదానం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ నటుడు పేదరికంలో ఉండటం వల్ల.. ఆపరేషన్ కు కావల్సిన 30 లక్షలు సమకూర్చలేకపోయారు. హరీష్ ప్రాణ  స్నేహితులు నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తుండగానే పెంగన్ ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం 3.25 గంటలకు ఆఞన  తుది శ్వాస విడిచారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక  స్టానం సంపాదించుకున్నారు హరీష్. నటుడి అంత్యక్రియలు ఈరోజు(31 మే) నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.