విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన `ఫ్యామిలీ స్టార్‌` శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందనతో రాణిస్తుంది. అయితే టీమ్‌ ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్‌ చేయడానికి ఓ క్రేజీ ప్లాన్‌ చేసింది.  

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం `ఫ్యామిలీ స్టార్‌`. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని దిల్‌ రాజు నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ బాగుంది. నిర్మాత దిల్‌ రాజు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. 

అయితే సినిమాని ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింతగా రీచ్‌ అయ్యేందుకు సరికొత్త ప్లాన్‌ చేసింది టీమ్‌. ఇంటింటి విజిటింగ్ కి ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఒకరు ఫ్యామిలీ స్టార్‌ ఉంటారని, ఇంటిని బాగు చేసేందుకు ప్రయత్నిస్తారని, ఫ్యామిలీని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారని, అతనే ఫ్యామిలీ స్టార్‌ అనేది ఈ మూవీ కాన్సెప్ట్. అలా ప్రతి ఒక్క కుటుంబంలో ఫ్యామిలీ స్టార్‌ ఉంటారు. ఆ ఫ్యామిలీ స్టార్‌ ఎవరో తెలియజేస్తే టీమ్‌ సర్‌ప్రైజ్‌ చేయబోతుంది. 

ఈ మేరకు ఒక కాంటెస్ట్ ని నిర్వహిస్తుంది. వాళ్లు ఇచ్చిన లింక్‌లో మీ ఇంట్లో ఫ్యామిలీ స్టార్‌ ఎవరు, ఎందుకు అనే వివరాలు ఫిల్‌ చేస్తే, వాటి ఆధారంగా డైరెక్ట్ గా `ఫ్యామిలీ స్టార్‌` టీమ్‌ వారిని కలిసి సర్‌ప్రైజ్‌ చేయాలని ప్లాన్‌ చేసింది. హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌, దర్శకుడు పరశురామ్‌, నిర్మాత దిల్‌ రాజు ఈ ఇంటింటి విజిటింగ్‌ చేయబోతున్నారట. దీంతో మీ(ఆడియెన్స్ ) ఇంట్లో ఫ్యామిలీ స్టార్‌ ఎవరు, ఎందుకు అనేది బలమైన కారణాలు తెలియజేస్తే, ఇంప్రెసింగ్‌ అనిపించి వారి ఇంటికి టీమ్‌ వెళ్తుందని చెప్పొచ్చు. మరి ఈ అవకాశం ఎవరికి దక్కుతుంది, టీమ్‌ ఏం సర్‌ప్రైజ్‌ చేయబోతుందనేది చూడాలి. 

Scroll to load tweet…

ఇక `ఫ్యామిలీ స్టార్‌` మూవీ శుక్రవారం తెలుగు, తమిళంలో విడుదలైంది. రెండు చోట్ల మిశ్రమ స్పందన లభిస్తుంది. ఇక ఓవర్సీస్‌లో మాత్రం సినిమాకి మంచి రెస్పాన్స్ ఉంది. అక్కడ మొదటి రోజు 500కే డాలర్లు(నాలుగ్నర కోట్ల) గ్రాస్‌ కలెక్ట్ చేసింది. అక్కడ ఈ మూవీ మంచి కలెక్షన్లని సాధించే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా పుంజుకుంటుందని నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. అయితే ఈ మూవీపై కొందరు కావాలనే నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారు. ట్రోల్‌ చేస్తున్నారు. `గుంటూరు కారం` విషయంలో జరిగినట్టే `ఫ్యామిలీ స్టార్‌`కి జరగడం ఆశ్చర్యంగా మారింది. మరి దీని వెనకాల ఎవరున్నాదనేది సస్పెన్స్ గా మారింది.