రియాలిటీగా పక్కా మాస్ సినిమా చేయాలంటే ఎవరి వల్ల కానీ పని. సెన్సార్ బోర్డు కత్తెరకు ఎలాంటి సీన్స్ అయినా ఎగిరిపోతాయని బయపడి సినిమాను రియాలిటీగా తెరకెక్కించడానికి జంకుతారు. కానీ ఈ నగరానికి ఏమైంది ఫెమ్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఫలక్ నుమా సినిమా చూస్తుంటే మనోడు గట్టిగా తెగించినట్లు అనిపిస్తోంది. 

గల్లీ బాయ్స్ లోకల్ బాయ్స్ అనే గ్యాంగ్ లు ఏ విధంగా పోట్లాడతాయో.. చాలా రియలిస్టిక్ గా చూపించారు. టీజరే ఇలా ఉందంటే సినిమా ఎలా ఉంటుందో అని అందరిలో ఒక ఆసక్తి నెలకొంది. పచ్చి బూతులు హార్డ్ రొమాంటిక్ లిప్ లాక్స్ గట్టిగానే తగిలించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ పోలీస్ గా హార్డ్ కా కనిపిస్తున్నాడు. 

టీజర్ చివరి వరకు ఏ మాత్రం తగ్గకుండా చూపించారు. సెన్సార్ కి పెద్ద సవాల్ విసిరారనే చెప్పాలి. మరి సినిమా వచ్చాకా జనాలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.