ఇంటర్నెట్ సెన్సేషన్ రణు మొండాల్ గాత్రానికి ఆకర్షితులైన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. మొత్తానికి రైల్వే ఫ్లాట్ ఫార్మ్ పై ఆలపించిన గాత్రం బాలీవుడ్ దిగ్గజాలను తాకింది. మొదటి అవకాశం ఇచ్చిన హిమేష్ రేషమ్మియా ఆమెకు తన నెక్స్ట్ సినిమాలో పాట పాడే అవకాశం కూడా ఇచ్చాడు. 

మొదటి పాటకు గాను 8లక్షల పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఆమెకు సంబందించిన మరో వార్త ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. సల్మాన్ ఖాన్ కూడా రణు మొండల్ పరిస్థితి గురించి తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్లు బాలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. 

55లక్షల ఖరీదైన ఇంటిని సల్మాన్ రణుకి కానుకగా ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మొదట ఆమె వీడియో పోస్ట్ చేసిన విక్కీ బిశ్వాస్ వెల్లడించాడు. అయితే హిమేష్ రేషమ్మియా మాత్రం పాట పాడే అవకాశం ఇచ్చి  పాటకు తగ్గ పారితోషికం ఇచ్చారని అతను క్లారిటీ ఇచ్చాడు.