తమిళ హీరోయిన్ నిక్కీ గల్రాని.. నటుడు జీవాపై మీటూ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో కోలివుడ్ లో వివాదం నెలకొంది. అయితే ఈ పోస్ట్ పెట్టింది తను కాదని క్లారిటీ ఇచ్చింది నిక్కి గల్రాని.

అసలు విషయంలోకి వస్తే.. జీవాపై మీటూ ఆరోపణలు చేస్తున్న కారణంగా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రావడం లేదని, పోస్ట్ పెట్టి తొలగించి జీవాకి క్షమాపణలు చెప్పినా.. తనకు సినిమాల్లో వస్తోన్న అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఇన్స్టాగ్రామ్ లో నిక్కీ గల్రాని పేరుతో ఓ పోస్ట్ ఉంది.

దీంతో ఆమె ఈ పోస్ట్ పెట్టిందని అందరూ అనుకున్నారు. దీంతో ఈ పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ అకౌంట్ లో ఇది తను పెట్టిన పోస్ట్ కాదని క్లారిటీ ఇచ్చింది. ''ఈ విషయం నా చేయి దాటిపోతోందని క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా.. నా పేరుతో ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అర్ధం కావడం లేదు.

జీవా నాకు మంచి ఫ్రెండ్. అతడిపై నేను ఎలాంటి నిందలు వేయలేదు.అతను నాతో తప్పుగా ప్రవర్తించలేదు. నా పేరుతో ఇలాంటి పనులు చేస్తున్న వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. మీ జీవితాలకు ఉపయోగపడే పనులు చేయండి'' అంటూ రాసుకొచ్చింది.