యంగ్ హీరోయిన్ సందీప్ కిషన్ ఓ ఆకతాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోటో పెట్టి ఫేక్ ప్రొఫైల్స్ సృష్టిస్తూ పలువురు అమ్మాయిలను వేధిస్తోన్న ఆకతాయిపై మండిపడ్డాడు. ఫేస్ బుక్ లో సందీప్ కిషన్ పేరిట అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్ లు పెడుతూ దూషిస్తున్నాడని సందీప్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని అభిమానులను కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.. ''నాకు రోజూ స్నేహితుల నుండి ఫోన్లు వస్తున్నాయి. ఓ వ్యక్తి నా ఫోటో పెట్టి ఫేస్ బుక్ లో ఫేక్ ఖాతాను సృష్టించాడట. ఆడపిల్లలకు అసభ్యకర మెసేజ్ లు పంపుతూ దూషిస్తున్నాడు. వెరిఫైడ్ అకౌంట్ నుండి కాకుండా నా ఫోటోలు ఉన్న మరే ఖాతాల నుండి వచ్చే సందేశాలకు మీరు స్పందించవద్దని వేడుకుంటున్నాను. అలాంటివారితో జాగ్రత్తగా ఉండండి'' అని రాసుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేనే' అనే హారర్, థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సందీప్ కిషన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.