కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. నిన్న ఎపిసోడ్ లో రేవంత్ బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. నిన్న ఎపిసోడ్ లో రేవంత్ బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. నేటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఎవిక్షన్ ప్రీ పాస్ టాస్క్ విధించారు. 

ఇంటి సభ్యులు ఎవిక్షన్ పీ పాస్ స్లాట్ ని గెలుచుకోవడం మాత్రమే కాదు.. దానికి మనీ వెచ్చించాలి. ఫైమా మొదట బజర్ ప్రెస్ చేసింది. దీనితో ఫైమా 80 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. రేవంత్, ఫైమా, శ్రీహన్ ఎవిక్షన్ ప్రీ పాస్ టాస్క్ కి ఎంపికయ్యారు. 

ఈ ముగ్గురిలో ఇతర సభ్యుల మద్దత్తు ఎవరికో ఒక్కొక్కరు తెలిపాలి. ఈ టాస్క్ నుంచి ఎవరైతే ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారో వారు ఎత్తుకున్న కర్రలపై బరువు ఉంచాలి. ఈ క్రమంలో ఆదిరెడ్డి ఫైమాకి మద్దత్తు తెలుపుతూ..రేవంత్ ఎలిమినేట్ కావాలని కోరుకున్నాడు. 

శ్రీహన్ తన కర్రలపై వేసిన బరువు మోయలేక గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఫైమా కర్రపై రెండు బరువైన బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. రేవంత్ కర్రపై దాదాపు 10 పైగా బ్యాగ్స్ ఉండడంతో బరువు మోయలేక కుప్పకూలాడు. దీనితో ఈ టాస్క్ లో ఫైమా విజేతగా నిలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతం చేసుకుంది.