టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా కొద్దిరోజుల క్రితం తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రష్యాకి చెందిన బిజినెస్ మెన్ఆండ్రె కోస్చీవ్ తో కొంతకాలం డేటింగ్ చేసిన ఈ బ్యూటీ 2018లో మార్చిలో అతడిని వివాహం చేసుకుంది.

పెళ్లి జరిగి ఇంత కాలం అవుతున్నా శ్రియ మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కానీ వీడియోలను కానీ షేర్ చేయలేదు. తొలిసారి ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో తన భర్తతో తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది.

ఈ జంట పెరులో ఎంజాయ్ చేస్తూ అక్కడ కొన్ని ఫోటోలను తీసుకున్నారు. వాటిని శ్రియ అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. శ్రియ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 

కానీ సీనియర్ హీరోల వరకే పరిమితమైంది. ఇప్పుడు ఆమెకి ఆ అవకాశాలు కూడా బాగా తగ్గాయని టాక్. నిజానికి 'వెంకీమామ' సినిమాలో వెంకీ సరసన హీరోయిన్ గా శ్రియని అనుకున్నారు. ఆమె దానికి ఒప్పుకుంది కూడా.. కానీ సడెన్ గా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.