మెగా హీరో వరుణ్ తేజ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మొదటి సారి కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ F2. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్` ట్యాగ్ లైన్‌. వీరికి జోడిగా తమన్నా - మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించారు. ఇటీవల సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇంకా ఒక పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 

అసలు విషయంలోకి వస్తే.. వెంకీ వరుణ్ ల గోల మరికొన్ని రోజుల్లో మొదలవనుంది. సినిమా టీజర్ ను డిసెంబర్ 12న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు మీడియాకు తెలియజేశారు.మంచి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను తెరకెక్కించారని చెబుతూ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలియజేశారు. 

ఈ సినిమా కామెడీతో పాటు మంచి మెస్సేజ్ కూడా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా వరుణ్ - వెంకీ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ సినిమాలో మెయిన్ హైలెట్ అని వివరణ ఇచ్చిన దిల్ రాజు సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని తెలియజేశారు.