విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన 'ఎఫ్ 2' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ తన సత్తా చాటింది ఈ చిత్రం.

వెండితెరపై వెంకీ, వరుణ్ ల ఫ్రస్ట్రేషన్ ని అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. విడుదల రోజు నుండి ఈ సినిమా స్టడీ కలెక్షన్స్ ని రాబడుతోంది. వారం రోజుల్లోనే యాభై కోట్ల షేర్ ని దాటేసిన ఈ సినిమా ఇప్పుడు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

జనవరి 12న విడుదలైన ఈ సినిమా రెండు వారాల్లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. సినిమా వంద కోట్ల షేర్ సాధించడంపై స్పందించిన దర్శకుడు అనీల్ రావిపూడి ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

గతేడాదిలో సరైన సినిమాలు లేక నిరాశలో ఉన్న దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.