వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా రూపొందిన మల్టీస్టారర్‌ `ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌`(ఎఫ్‌2)కి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ పెస్టివల్‌ ఆప్‌ ఇండియా  కు చెందిన పురస్కారం దక్కించుకుంది. ప్రతిష్టాత్మక పనోరమా విభాగంలో టాలీవుడ్‌కి చెందిన `ఎఫ్‌2`కి స్పెషల్‌ జ్యూరీ అవార్డు దక్కడం విశేషం. మొత్తం వివిధ భాషలకు చెందిన 26 సినిమాలను ఈ అవార్డుల కోసం ఎంపిక చేయగా, అందులో తెలుగు నుంచి ఒకే ఒక్క చిత్రం `ఎఫ్‌2` ఉండటం మరో విశేషం. తమ సినిమాకి కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. 

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటించారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. కేవలం 30కోట్లతో రూపొంది, ఏకంగా దాదాపు 120కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. దీన్ని దిల్‌రాజు నిర్మించడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.