Asianet News TeluguAsianet News Telugu

F2 బాక్స్ ఆఫీస్: 140 కోట్లా?

మొత్తానికి ఒక మల్టీస్టారర్ సినిమా సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను అందుకుంది. తెలుగులో ఎన్నడూ లేని విధంగా ఓకే కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన మల్టీస్టారర్ అత్యధిక వసూళ్లను అందుకోవడం ఇదే మొదటిసారి. వరుణ్ తేజ్ - వెంకటేష్ నటించిన F2 సినిమా సంక్రాంతి కానుకగా రిలీజైన సంగతి తెలిసిందే. 

F2 LATEST BOX OFFICE COLLECTIONS
Author
Hyderabad, First Published Feb 23, 2019, 5:41 PM IST

మొత్తానికి ఒక మల్టీస్టారర్ సినిమా సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను అందుకుంది. తెలుగులో ఎన్నడూ లేని విధంగా ఓకే కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన మల్టీస్టారర్ అత్యధిక వసూళ్లను అందుకోవడం ఇదే మొదటిసారి. వరుణ్ తేజ్ - వెంకటేష్ నటించిన F2 సినిమా సంక్రాంతి కానుకగా రిలీజైన సంగతి తెలిసిందే. 

హాలిడేస్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ ను రాబట్టిన ఈ  ఎంటరైనర్ ఊహించని విధంగా 75కోట్లకు పైగా అందుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి రేంజ్ కూడా ఈ సినిమాతో గట్టిగా పెరిగింది. ఇకపోతే సినిమాకు సంబందించిన లేటెస్ట్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 

140కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజయినప్పటికీ  ఆ తరువాత కూడా సినిమా థియేటర్స్ లో బాగానే ఆడింది. ఇప్పటికి పలు ఏరియాల్లో వీకెండ్స్ లో సినిమా మంచి కలెక్షన్స్ ను రాబడుతున్నట్లు సమాచారం.   

Follow Us:
Download App:
  • android
  • ios