మొదటి నుంచి ఎదో ఒక డిఫరెంట్ సినిమా చేస్తూనే మళ్ళి రెగ్యులర్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి నచ్చే సినిమాలు చేయడం వెంకీ స్టైల్. అయితే గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్న వెంకటేష్ కి అసలైన విక్టరీ వచ్చింది. F2 కలెక్షన్స్ 100 కోట్ల గ్రాస్ క్రాస్ అవ్వడంతో విక్టరీ లేట్ గా వచ్చినా స్ట్రాంగ్ గా ఉంది గురు.. అన్నట్లు విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. 

మొత్తానికి సినిమా 70 కోట్లకు పైగా షేర్స్ ని అందుకుంది. ఇదే వెంకీ కెరీర్ లో అత్యధిక లాభాలను అందించిన సినిమా. ఇక మొన్నటివరకు వెంకీ తదుపరి ప్రాజెక్టులను ఫినిష్ చేస్తాడా అన్న సందేహాలకు కూడా సమాధానం ఇచ్చేశాడు. నెక్స్ట్ మేనల్లుడు అక్కినేని నాగ చైతన్యతో వెంకీ మామ అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో వర్క్ చేసిన వెంటనే వెంకటేష్ తో మరో కామెడీ ఎంటర్టైనర్ ను మొదలెట్టనున్నాడు. 

అనంతరం కుదిరితే ఇదే ఏడాది త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో కూడా వెంకటేష్ నటించనున్నాడు. రీసెంట్ గా త్రినాథరావు చెప్పిన కథను విన్న వెంకీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఫుల్ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మరో ఇద్దరు యువ దర్శకులు కూడా వెంకీతో వర్క్ చేయడానికి కథలను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ దగ్గుబాటి హీరో F2 కారణంగా చాలా కాలం తరువాత కెరీర్ లో ఫుల్ బిజీ అయ్యాడు.