నాల్గో పాట `ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. ` అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం ఈ ప్రోమోని పంచుకున్నారు యూనిట్‌. ఇందులో వందల మంది డాన్సర్ల మధ్య పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో మాస్‌ సాంగ్‌కి డాన్సు వేస్తున్నాడు అల్లు అర్జున్. 

అల్లు అర్జున్‌(Allu Arjun) ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. గ్యాప్‌ లేకుండా `పుష్ప`(Pushpa) సినిమా నుంచి సర్‌ప్రైజ్‌లిస్తూ ఫ్యాన్స్ ని, జనరల్‌ ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా Pushpa చిత్రం నుంచి మరో గిఫ్ట్ వచ్చింది. నాల్గో పాట `ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. ` అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం ఈ ప్రోమోని పంచుకున్నారు యూనిట్‌. ఇందులో వందల మంది డాన్సర్ల మధ్య పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో మాస్‌ సాంగ్‌కి డాన్సు వేస్తున్నాడు Allu Arjun. పండుగ సందర్భంగా జాతరలో డాన్స్ చేస్తున్న సాంగ్‌ ప్రోమో బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ పాట ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది.

తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ పాటని విడుదల చేశారు. హిందీలోనూ ఈ రాత్రి రిలీజ్‌ చేయబోతున్నారు. ఇక ఈ పూర్తి పాటని ఈ నెల 19న ఉదయం 11.07గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ పాటకి చంద్రబోస్‌ లిరిక్‌ రాయగా, నకాష్‌ అజిజ్‌ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న `పుష్ప` చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 17న ఐదు భాషల్లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల కాబోతుంది. 

ఈ నేపథ్యంలో ప్రమోషనల్‌ కార్యక్రమాల జోరు పెంచారు. ఇప్పటికే మూడు పాటలను విడుదల చేయగా, అవి యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో మిలియన్స్ వ్యూస్‌ని సొంతం చేసుకుని దూసుకుపోతున్నాయి. శ్రోతలను అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే హిందీలో సినిమా రిలీజ్‌కి సంబంధించి సమస్యలు తలెత్తిన నేపథ్యంలో స్వయంగా అల్లు అర్జున్‌ రంగంలోకి దిగి ఆ సమస్యని పరిష్కరించినట్టు తెలుస్తుంది. హిందీ రైట్స్ దక్కించుకున్న ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి, ప్రొడక్షన్‌ హౌజ్‌ గోల్డ్ మైన్‌ టెలీఫిల్మ్స్ కి మధ్య వివాదం తలెత్తడంతో దాన్ని బన్నీ పరిష్కరించి ఎలాంటి అడ్డంకి లేకుండా డిసెంబర్‌ 17న విడుదలయ్యేందుకు లైన్స్ క్లీయర్ చేశారట. 

ఇక ఎర్రచంద్రన స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో అల్లు అర్జున్‌.. పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే దొంగగా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇందులో పోలీస్‌ అధికారిగా, నెగటివ్‌ రోల్‌లో మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. యాంకర్‌ అనసూయ, కమెడీయన్‌ సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరివి కూడా నెగటివ్‌ రోల్సే అని టాక్‌. ఇప్పటికే సునీల్‌, అనసూయ పాత్రల ఫస్ట్ లుక్‌లు విడుదలై ఆకట్టుకున్నాయి. గతంలో ఎప్పుడూ కనిపించని ఓ కొత్త లుక్‌లో వీరిద్దరు కనిపించబోతుండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఐదో సాంగ్‌లో సమంత స్పెషల్‌ నెంబర్‌ చేస్తుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.

related news: ‘పుష్ప’ రిలీజ్ సమస్య, బన్ని స్వయంగా సీన్ లోకి వచ్చేకే సాల్వ్ !