బాహుబలి సినిమాలో విలన్ అనగానే రానా గుర్తొస్తాడు. కానీ అందులో భల్లాలదేవ అంగరక్షకుడిగా కనిపంచిన రాకేష్ వర్రే అందరికి గుర్తుండే ఉంటుంది. మాహిష్మతి సభలో ప్రభాస్ అతని తలనరికే సీన్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే హార్డ్ గా కనిపించే రాకేష్ ఇప్పుడు కథానాయకుడిగా కూల్ గా దర్శనమిస్తున్నాడు.  

"ఎవ్వరికి చెప్పొద్దూ.. నా పెళ్లి" అనే డిఫరెంట్ క్యూట్ అండ్ క్రేజీ లవ్ స్టోరీతో రాబోతున్నాడు. నెగిటివ్ రోల్స్ లో అన్ని విధాలా మెప్పించిన రాకేష్ ట్రైలర్ లో చాలా పాజిటివ్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ట్రైలర్ కూడా చాలా సింపుల్ & బెస్ట్ అన్నట్లు ఉంది. షార్ట్ ఫిలిమ్స్ తో క్లిక్కయిన గార్గేయి ఏల్లప్రగడ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక చిత్ర యూనిట్ మార్చ్ 22న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది.