Asianet News TeluguAsianet News Telugu

‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ కు అంతా సిద్ధం.. ఎప్పుడు రానుందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’(Adipurush)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 
 

Everything is ready for the first look of Adipurush.. When will it come?
Author
First Published Aug 28, 2022, 9:55 AM IST

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ - రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో హిందీలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఇటు అభిమానులు, అటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా వస్తుండటంతో  తొలిసారిగా ప్రభాస్ ను ‘రాముడి’పాత్రలో చూడబోతున్నందుకు ప్రేక్షకులు మరింత ఎగ్జైట్ ఫీలవుతున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

కాగా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అందలేదు. సినిమా ప్రారంభంలోనే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత అప్పడప్పుడు సినిమాపై వస్తున్న సమాచారంతోనే అభిమానులు ఖుషీ అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఇంకా ఐదు నెలల పాటు సమయం ఉంది. ఇప్పటికే చాలా కాలంగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. పలుమార్లు ‘అప్డేట్ ప్లీజ్’ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు సైతం పెట్టారు. 

ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులను ఫుల్ ఖుషీ చేసేందుకు ‘ఆదిపురుష్’ టీం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ మాసం చివరికల్లా ఈ అప్డేట్ మాత్రం తప్పకుండా వస్తుందని సినీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ అప్డేట్ వస్తే కాస్తా ఉపశమనంగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే చిత్రం విజువల్ పరంగా మంచి అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది. 

ప్రభాస్ తొలిసారిగా డైరెక్ట్ హిందీ ఫిల్మ్ లో నటిస్తుండటం పట్ల  అభిమానులు, తెలుగు ఆడియెన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.  హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’లో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్ (Krithi Sanon) నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీలక పాత్రలు  పోషిస్తున్నారు. 2023 జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios