ఎవరు మీలో కోటీశ్వరుడు మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా రామ్ చరణ్ రానున్నారట.చరణ్ హాట్ సీట్ లో కూర్చొని ఎన్టీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారట.

నేడు విడుదలైన ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి ఓ విజువల్ వండర్ తెరకెక్కించినట్లు అర్థం అవుతుంది. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కి మేకింగ్ వీడియోతో గూస్ బంప్స్ కలిగాయి అనడంలో సందేహం లేదు. కాగా వెండితెరపై ఎన్టీఆర్,చరణ్ ల వీరోచిత పోరాటాలు చూడనున్న అభిమానులు .. బుల్లితెరపై వీరిద్దరిని కలిసి చూడనున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరుడు రియాలిటీ షో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగింది. ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం ప్రోమోలలో ఎన్టీఆర్ ఇరగదీశాడు. అలాగే ఎన్టీఆర్ పై కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ కూడా పూర్తయింది. త్వరలో ప్రసారం కానున్న ఈ ప్రోగ్రాం కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 


ఎవరు మీలో కోటీశ్వరుడు మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా రామ్ చరణ్ రానున్నారట.చరణ్ హాట్ సీట్ లో కూర్చొని ఎన్టీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారట. మొదటి ఎపిసోడ్ లో ఆర్ ఆర్ ఆర్ హీరోలు కొమరం భీమ్, రామ రాజు సందడి చేయనున్నారనే న్యూస్ విశ్వసనీయ వర్గాల ద్వారా బయటికి వచ్చింది. దీనితో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు మీలో కోటీశ్వరుడు మొదటి ఎపిసోడ్ భారీ టీఆర్పీ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 


గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లారు. నాగార్జున హోస్ట్ కాగా ఆ ఎపిసోడ్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ వన్ హోస్ట్ గా ఇరగదీసిన ఎన్టీఆర్, ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో సామాన్యులతో ఎలా మమేకం కానున్నారో చూడాలి.