ఇలియానా ని అనుకుంటే ఆమె మీరు ఇచ్చే రెమ్యునేషన్ చాలదనంటూ హ్యాండ్ ఇచ్చింది. దాంతో చాలా మందిని అనుకుని చివరకు..బాలీవుడ్ బ్యూటీ ..తన హాట్ నెస్ తో సోషల్ మీడియాని దున్నేస్తున్న ఈషా గుప్తాని సీన్ లోకి తెచ్చారని సమాచారం. ఈ నెల 14వ తేదీ నుంచి అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ ఐటెంసాంగ్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.   సినిమాలో ఇదొక పబ్ సాంగ్ గా వస్తుంది. 

ఇందుకోసం  రిచ్ లుక్ తో ఓ పబ్ సెట్ వేశారు. ఈ సెట్ లోనే ఈషా గుప్తా-రామ్ చరణ్ ఆడిపాడబోతున్నారు.  సినిమా హైలెట్స్ లో ఇదొకటి కానుందిట. అలాగే మెగా అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంటుందట. బోయపాటి సినిమాలంటే కావాల్సినంత మాస్ ఉంటుంది కాబట్టి.. మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’ హీరో రామ్ చరణ్ సరసన కైరా అద్వాని నటిస్తుండగా.. ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య.. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.