షాకింగ్ గా ఉన్నా నిజం అంటున్నాడు హీరో ఇమ్రాన్ హష్మి. వెండి తెరపై సీరియల్ కిస్సర్ గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ తన పెళ్లికు ముందు అనుకోకుండా ఓ పెళ్లైన మహిళతో అక్రమ సంభందం నెరిపానని ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. 2004లో తను చేసిన మర్డర్ సినిమాలాంటి వ్యవహారమే తన జీవితంలోకీ వస్తుందని ఊహించలేదని అంటున్నారు. అయితే అది తప్పే అని ఒప్పుకున్నారు.

ఇమ్రాన్ హష్మి మాట్లాడుతూ...అయితే ఆమెతో సంబంధం పెట్టుకునేటప్పుడు ఆమెకు పెళ్లైందనే విషయం తెలియలేదని అన్నారు. ఆమెకూడా చెప్పేది కాదని వివరించారు. తర్వాత అనుకోకుండా ఓ రోజు విషయం బయటపడిందని, అప్పుడు ఆమెను వదిలేద్దామనుకున్నాను కానీ, కొన్ని బలహీన పరిస్దితుల్లో కంటిన్యూ చేసానని చెప్పుకొచ్చాడు. నేను ఆ రిలేషన్  నుంచి బయిటపడాలని చాలా ప్రయత్నించాను కానీ లాజిక్ కు అందని కారణాలేవో కట్టిపడేసాయని చెప్పుకొచ్చాడు. మానసికంగా చాలా తప్పు చేసిన ఫీలింగ్ లో ఉండేవాడిని అన్నారు. 

అదే నా ఫ్యామిలీలో  జరిగితే ఖచ్చితంగా నా భార్యతో అలా ఎవరైనా ఎఫైర్ పెట్టుకుంటే నేను ఆ వ్యక్తిని చంపేసేవాడిని అన్నారు. ఇక ఆ రిలేషన్ ఇప్పుడయితే లేదు. ఓ రోజు ఆమె భర్త మా ఎఫైర్ రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. పెద్ద గొడవైంది. అప్పుడు మాకు, ఆమెకు సంబంధించిన కొందరు మధ్యవర్తులు కలగ చేసుకుని చక్క దిద్దారు. నేను నా తప్పుని నిజాయితీగా ఒప్పుకున్నాను. అయితే జీవితంలో ఓ పాఠం నేర్చుకున్నా. ఎప్పుడు సాహసంగా ఉందని ఇలాంటి చెత్త పనులు చేయకూడదని అని చెప్పుకొచ్చాడు.