జబర్దస్త్ జంట వర్ష, ఇమ్మాన్యుయెల్ .. జబర్దస్త్ కామెడీ షోలో పాపులర్ జంటగా నిలిచారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. ఈ షోకి మంచి టీఆర్‌పీని తీసుకొస్తుంది. కానీ తాజాగా జరిగిన పరిణామాలు షాకిస్తున్నాయి.
ఇమ్మాన్యుయెల్, వర్షలు జబర్దస్త్ లో రొమాంటిక్ స్కిట్లు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. లవ్ స్టోరీ స్కిట్లతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. డ్యూయెట్లు పాడుతూ, స్టేజ్‌పైనే లవ్ ప్రపోజ్ చేస్తూ, చివరికి ఎంగేజ్‌మెంట్లే కాదు, పెళ్లి వరకు వెళ్లారు. ఒకరిపై ఒకరు తమ ప్రేమని వ్యక్తం చేస్తూ నిజంగానే ప్రేమికులమనే కలరింగ్ ఇస్తున్నారు. ఇమ్మాన్యుయెల్ లేకపోతే కష్టం అంటూ వర్ష చెప్పిన తీరు ఆశ్చర్యపరిచింది. ఇద్దరు ఎంత డెప్త్ గా ప్రేమించుకుంటున్నారో తెలియజేశారు.
కానీ ఆ తర్వాత కొంత గ్యాప్ మెయింటేన్ చేస్తూ వస్తున్నారు. కానీ వారిలో ఆ ప్రేమ అలానే ఉందనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. పడిపోయిన ఇమ్మాన్యుయెల్‌ని చూసి షాక్ అయ్యింది వర్ష. బోరున విలపిస్తూ సహాయం కోసం వేడుకుంది. ఇదే ఇప్పుడు అందరి చేతి కన్నీళ్లు పెట్టిస్తుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే. తాజాగా `శ్రీదేవి డ్రామా కంపెనీ` ప్రోమో విడుదలైంది. ఇందులో ఆది కామెడీ ఎప్పటిలాగే అలరించింది. నవ్వులు పూయించింది.
కానీ చివర్లో ఓ స్కిట్ ప్రదర్శించారు ఇమ్మాన్యుయెల్, వర్ష. ఇందులో ఇమ్మాన్యుయెల్ చనిపోతే వర్ష ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని చెబుతుంది యాంకర్ రష్మి. ఇక నెలపై చనిపోయిన స్థితిలో పడి ఉండగా, అది చూసిన వర్ష తట్టుకోలేకపోయింది. వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఎవరైనా ఉన్నారా? అంటూ భోరున విలపించింది. ఇది అందరిని కదిలించడం విశేషం.
అయితే ఇది చూడ్డానికి స్కిట్టే అయినా, అందులో వర్ష నిజంగానే ఇన్‌వాల్వ్ అయిపోయింది. నిజంగానే ఇమ్మాన్యుయెల్ కి అలా జరిగితే ఎలా రియాక్ట్ అవుతారో వర్ష కూడా అలానే రియాక్ట్ అవడం ఆశ్చర్యపరిచింది. అందరిని కదిలించింది. ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. ఈ షో వచ్చే ఆదివారం ఈటీవీ ప్రసారం కానున్న విషయం తెలిసిందే. `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి రష్మి యాంకర్‌గా చేస్తుండగా, జబర్దస్త్ కమెడియన్లు ఇందులో వివిధ రకాల స్క్రిట్లు, ప్రోగ్రామ్‌లు, డాన్సులు, పాటలు పాడుతూ అలరిస్తుంటారు. ఇది అన్ని రకాల ప్రతిభకి నెలవుగా నిలుస్తుంది.

