కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న బిగ్ బాస్ 3పై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. దేశంలో బిగ్ బాస్ షోకి నెలకొని ఉన్న క్రేజ్ వల్ల ఇలాంటి ఊహాగానాలు సహజమే. ఈ సారి బిగ్ బాస్ షోలో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. బిగ్ బాస్ 2లో సామాన్యులకు అవకాశం కల్పించారు. కానీ బిగ్ బాస్ 3లో అలాంటి ప్రయోగం చేయడం లేదు. 

14 మంది సెలెబ్రిటీలనే ఎంపిక చేశారు. కంటెస్టెంట్స్ గురించి కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎలిమినేషన్ ప్రక్రియ గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఎలిమినేషన్ విధానంలో బిగ్ బాస్ నిర్వాహకులు మార్పులు చేశారట. గత సీజన్ లో గూగుల్ ఓటింగ్ సిస్టం ద్వారా ఎలిమినేషన్ నిర్వహించారు. 

కానీ ఈ సారి హాట్ స్టార్ ఓటింగ్ ఉంటుందట. ఫోన్ లైన్ ఓటింగ్ కూడా ఉంటుందని అంటున్నారు. బిగ్ బాస్ 3 కొత్త రూల్స్ ఏంటి, ఎవరెవరు పాల్గొనబోతున్నారు లాంటి ఆసక్తికరమైన విషయాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యే తొలి ఎపిసోడ్ లో తెలుస్తాయి.