బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ ఆసక్తికరమైన టాస్క్ ని ఇస్తున్నారు. సీక్రెట్ టాస్క్ లు కూడా మొదలయ్యాయి. ఒకరి గురించి ఒకరు రహస్యంగా మాట్లాడుకున్న విషయాలని రివీల్ చేస్తూ బిగ్ బాస్ నారదుడి పాత్రని పోషిస్తున్నాడు. ఈ వారం షో నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 

ఈ వారం బాబా భాస్కర్, హిమజ, రాహుల్, పునర్నవి, మహేష్, అషు రెడ్డి, శివ జ్యోతి నామినేషన్ లో ఉన్నారు. వీరిలో రాహుల్ నామినేషన్ లో ఉన్న ప్రతి సారి ఎలాగోలా గట్టెక్కుతున్నాడు. బాబా భాస్కర్, పునర్నవి, మహేష్, హిమజ లకు ఆడియన్స్ నుంచి మద్దతు లభిస్తోంది. శివ జ్యోతి కెప్టెన్ కాబట్టి ఆమె ఎలిమినేషన్ నుంచి గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అషు రెడ్డే అని అప్పుడే లీకులు మొదలైపోయాయి. అషుపై ఎలాంటి నెగిటివిటి లేదు కానీ ఆమె హౌస్ లో అంత యాక్టివ్ కాదు. ఆడియన్స్ మహేష్, హిమజ, బాబా భాస్కర్ ని సేవ్ చేసే క్రమంలో అషుకు ఓట్లు తగ్గాయనే చర్చ కూడా జరుగుతోంది. 

ఇదిలా ఉండగా ఈ వారం మరో సర్ ప్రైజ్ కూడా ఉందట. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఓ హీరోయిన్ ఆదివారం రోజు హౌస్ లోకి ప్రవేశించబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందులో ప్రధానంగా శ్రద్దా దాస్, ఇషా రెబ్బా, హెబ్బా పటేల్ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.