షాకిచ్చే లా ‘ఏక్ మినీ కథ’ ఓటీటి రేటు

 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసారు. కానీ పరిస్దితులు బాగోలేవు. దాంతో ఓటీటి లో ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Ek Mini Katha To Release In OTT Prime  jsp

‘పేపర్ బాయ్’ సినిమాతో పరిచయం అయిన సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా మూవీ ‘ఏక్ మినీ కథ’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తుంది. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ సినిమా రూపొందుతోంది. కొన్నిసార్లు చిన్న విషయాలే జీవితంలో పెద్ద సమస్యలను ఎలా సృష్టిస్తాయనేది ఈ సినిమాలో ఫన్ గా చర్చించారు. 

 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసారు. కానీ పరిస్దితులు బాగోలేవు. దాంతో ఓటీటి లో ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుందట.  బోల్డ్ అడల్డ్ పాయింట్‌తో వస్తున్న ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.  అడల్ట్ టచ్ కామెడీ మూవీ కావడంతో అమెజాన్‌ కూడా మంచి రేటుకే కొనేందుకు ముందుకు వచ్చిందట. రూ.9 కోట్లకు ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. 

నిజానికి ఈ సినిమాకు నిర్మాతలు చాలా లో బడ్జెట్ లో ప్లాన్ చేసారట.  రూ.5 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఏకంగా 9 కోట్లకు బేరం కుదరడంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే ఈ అడల్ట్‌ టచ్‌ కామెడీ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలంటోంది ట్రేడ్. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios