ఈషా రెబ్బ.. అంతకుముందు ఆ తరువాత సినిమాతో టాలీవుడ్ కి సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు పిల్ల ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా దర్శనమిస్తోంది. అసలు బేబీ తపన ఏమిటో గాని అవకాశాలు అందుకోవడానికి రెగ్యులర్ ఫొటో షూట్స్ తో ప్రయత్నాలు చేస్తోంది. 

ఏ మాత్రం ఆలోచించకుండా హోమ్లీ ఫెస్ లోనే గ్లామర్ అందాలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తోంది. దీంతో నెటిజన్స్ ఈ పిల్లను ఎవరైనా పట్టించుకోండయ్యా అంటూ కొంటెగా కామెంట్ చేస్తున్నారు. గత ఏడాది అరవింద సమేతలో చిన్న పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన మాత్రం పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. 

హాట్ ఫొటోస్ తో ఎప్పటికప్పుడు జనాల దృష్టిలో పడుతున్నప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు. కన్నడలో రీసెంట్ గా ఒక అవకాశం వచ్చింది కానీ అమ్మడికి ఆ లెవెల్ సరిపోదు. త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు టాక్. మరి భవిష్యత్తులో ఈ బ్యూటీ ఎలాంటి ఛాన్సులను దక్కించుకుంటుందో చూడాలి.