టాలీవుడ్ లో గత కొంత కాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న నటీమణుల్లో ఈషా రెబ్బ కూడా ఒకరు. బేబీ హిట్టందుకోవడం కోసం గ్లామర్ ఫొటోస్ తో నిత్యం సోషల్ మీడియాలో దర్శనమిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మొత్తానికి ఒక హారర్ కథను పట్టేసినట్లు తెలుస్తోంది. 

నాగార్జునతో డమరుకం వంటి సినిమా చేసిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి చాలా ఏళ్ల తరువాత ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు. హారర్ సస్పెన్స్ కథాంశంతో తెరకెక్క నున్నశ్రీనివాస్  సినిమాలో కథానాయికగా ఈషా రెబ్బ సెలెక్ట్ అయ్యింది. త్వరలోనే సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. 

ఇక చివరగా సుబ్రహ్మణ్యపురం సినిమాలో కనిపించిన ఈషా ఆ తరువాత ఎక్కువగా కనిపించలేదు. అరవింద సమేత లాంటి సినిమాలో నటించినా కూడా పెద్దగా పాపులర్ అవ్వలేదు గాని ఈ మధ్య బేబీ ఫొటో షూట్స్ తో గ్లామర్ తో ఎటాక్ చేస్తోంది. మరి వచ్చిన చిన్న అవకాశంతో అయినా అమ్మడు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.