Asianet News TeluguAsianet News Telugu

మండిపడ్డ 'ఈటీవి', కోటి కట్టమంటూ అల్టిమేటం?

ఎన్నడు లేని విధంగా బాహుబలి నిర్మాతలతో తమకు ఉన్న పరిచయాల కారణంగా... ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ ని రెండున్నర కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.  ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ సినిమాని మంచి రోజు చూసి తమ  ‘ఈటీవి’ లో ప్రసారం చేయాలని చూస్తోంది. అయితే ఊహించని ట్విస్ట్ పడింది. 
 

Ee tv serious on cable tv for For Uma Maheswara Ugra Roopasya
Author
Hyderabad, First Published Aug 22, 2020, 7:08 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మిగతా ఛానెల్స్ కు 'ఈటీవి'కు తేడా ఏమిటంటే...ఇదొక వ్యవస్దీకృతమైన వ్యవహారం. ఎక్కడా క్రమశిక్షణ తప్పకుండా యాజమాన్య ఆదేశాలను ఎట్టిపరిస్దితుల్లోనూ తూచ, తప్పకుండా ముందుకు వెళ్తూంటుంది. దాంతో మిగతా ఛానెల్స్ తరహాలో కొత్త సినిమాలు కొనటం వంటి విషయాల్లో స్పీడు చూపించదు. ఆచి,తూచి అడుగులు వేస్తూంటుంది. ఈ క్రమంలో ఎన్నడు లేని విధంగా బాహుబలి నిర్మాతలతో తమకు ఉన్న పరిచయాల కారణంగా... ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ ని రెండున్నర కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.  ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ సినిమాని మంచి రోజు చూసి తమ  ‘ఈటీవి’ లో ప్రసారం చేయాలని చూస్తోంది. అయితే ఊహించని ట్విస్ట్ పడింది. 

హైదరాబాద్ కు చెందిన ఓ కేబుల్ టీవి వాడు ...అత్యుత్సాహంగా తమ ఛానెల్ లో ప్రసారం చేసేసారు. ఈ విషయం తెలుసుకున్న ఈటీవి స్టాఫ్ అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. తాము అంత ఖరీదు పెట్టి రైట్స్ తీసుకుంటే ఇష్టం వచ్చినట్లు అలా ఎలా ప్రసారం చేస్తుంది. కేబుల్ టీవి చట్టాలు పట్టించుకోదా అంటూ...తమకు నష్టపరిహారంగా కోటి రూపాయలు కట్టమంటూ నోటీసులు పంపినట్లు సమాచారం.  అయితే ఆ కేబుల్ టీవి వాళ్లు తాము అంత కట్టలేమని, పొరపాటు జరిగిందని, కాళ్లు పట్టుకున్నంత పనిచేసి అడిగితే, క్షమించి, వార్నింగ్ ఇచ్చి , లీగల్ నోటీసులు వెనక్కి తీసుకుని వదిలేసినట్లు సమాచారం. ఈ విషయం టీవి మీడియాలో సెన్సేషన్ గా మారింది. 

సత్యదేవ్, హరి చందన, రూప హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’.  ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుద‌లై సూప‌ర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో పాటు విమ‌ర్శ‌కులను ఈ చిత్రం ద‌క్కించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన చాలా మంది సినిమా ప్రముఖులు చిత్ర యూనిట్‌కు ట్విట్ట‌ర్ ద్వారా అభినంద‌న‌లు తెలియ‌జేశారు.
 
 మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌` టైటిల్ తో రీమేక్ చేశాడు. ఇక `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` ... గత పదేళ్లకాలంలో వచ్చిన గొప్ప మలయాళ చిత్రాల్లో ఒకటి. ఆర్కా మీడియా వ‌ర్క్స్,  మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా  తీసిన ఈ సినిమాలో సత్యదేవ్ ను హీరోగా చేసారు. 
 
స‌త్య‌దేవ్ కంచ‌ర‌న, న‌రేష్‌, సుహాస్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ రాంప్ర‌సాద్‌, కరుణాకరణ్, టి.ఎన్‌.ఆర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌వ‌న్ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: బిజ్‌బ‌ల్‌, కెమెరా: అప్పు ప్ర‌భాక‌ర్‌, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేశ్ మ‌హ‌, నిర్మాత‌లు: శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్రసాద్ దేవినేని(ఆర్కా మీడియా వ‌ర్క్స్‌), విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి(మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్‌).

Follow Us:
Download App:
  • android
  • ios