Asianet News TeluguAsianet News Telugu

Sachin Joshi : నటుడు, నిర్మాత సచిన్ జోషి ఆస్తి 410 కోట్లు జప్తు

చిన్ జోషికి చెందిన ఓంకార్ గ్రూప్ అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని వచ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ ద‌ర్యాప్తులో భాగంగా సచిన్ జోషి ఆస్తులని జప్తు చేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. లోన్‌ ఫ్రాడ్‌ కేసులో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది.

ED attaches assets worth Rs 410 crore of Omkar Group, Sachin Joshi
Author
Mumbai, First Published Jan 16, 2022, 11:58 AM IST


సినీ న‌టుడు, నిర్మాత స‌చిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్ట‌రేట్ (ఈడీ) షాకిచ్చింది. మ‌నీలాండ‌రింగ్ కేసులో ఆయ‌న ఆస్తుల‌ను జ‌ప్తు చేసింది.  సచిన్ జోషికి సంబంధించిన రూ.410 కోట్ల ఆస్తుల‌ను ఈడీ జప్తు చేసింది. ఇందులో రూ.330 కోట్ల వ‌ర‌కు ఓంకార్ గ్రూప్‌కు చెందిన ఆస్తులు కాగా, మిగిలిన రూ.80 కోట్లు వైకింగ్ గ్రూప్ కంపెనీకి చెందిన‌వ‌ని ఈడీ వెల్ల‌డించింది. ఎస్ఆర్ఏ అనే ప్రాజెక్టులో భాగంగా స‌చిన్ జోషికి చెందిన ఓంకార్ గ్రూప్ అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని వచ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ ద‌ర్యాప్తులో భాగంగా సచిన్ జోషి ఆస్తులని జప్తు చేసింది.

ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. లోన్‌ ఫ్రాడ్‌ కేసులో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.  ఈమేరకు ఔరంగాబాద్‌ సిటీ చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయ్యింది. కిందటి ఏడాది  సచిన్‌ జోషి అరెస్ట్‌ అయ్యాడు కూడా.

సచిన్‌ జోషి 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వగా.. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు. చివరగా 2017లో వీడెవడు సినిమాలో కనిపించాడు.సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌తోనూ సచిన్‌ సుపరిచితుడే.బాలీవుడ్‌లో కూడా ప‌లు సినిమాలు చేశాడు. తెలుగులో ‘నెక్ట్స్ ఏంటి’ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. కొన్ని సినిమాలకి ఫైనాన్స్ కూడా అందించారు

Follow Us:
Download App:
  • android
  • ios