డివైన్ బ్లాక్ బస్టర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి స్వయంగా దీనికి దర్శకత్వం వహించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయ కిరగందుర్ ఈ మూవీని నిర్మించారు.

తెలుగులో అక్టోబర్ 15వ తేదీన విడుదలైన కాంతార సినిమా కలెక్షన్లపరంగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. దీపావళి సినిమాలు కూడా పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో కాంతార జోరు ఇంకా తగ్గలేదు. అలాగే ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరాంగదుర్‌ నిర్మించారు. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ 'గీతాఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌' ద్వారా విడుదల చేశారు. కాంతార చిత్రం విడుదలైన 2 వారాల్లోనే 45 కోట్లు వసూళ్లు సాధించి రికార్డు సాధించింది.

తాజాగా ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ల పరంగా కుమ్మేయం రికార్డేనని సినీ పండితులు అంటున్నారు. కాంతార కేవలం తెలుగులోనే కాకుండాప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు మొదట వేరే హీరోతో చేద్దామనుకున్నారట రిషబ్. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.

రీసెంట్ గా మీడియా ఇంటర్వ్యూలో హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి మాట్లాడుతూ...నిజానికి మొదట ఈ సినిమా స్టోరీని తాను పునీత్ రాజ్ కుమార్ గారికి వినిపించానని అయితే అప్పట్లో ఆయన వరుసగా ఇతర సినిమాల షెడ్యూల్ తో బిజీగా ఉండటంతో ఈ సినిమాని చేయలేకపోయారని అన్నారు. అలానే అనంతరం కొన్నాళ్ల తర్వాత తానే హీరోగా చేస్తున్న సమయంలో సినిమా యొక్క విజన్ అలానే టేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని పునీత్ సలహా ఇచ్చారన్నారు. ఆ విధంగా పునీత్ రాజ్ కుమార్ ఈ ప్రెస్టీజియస్ సినిమాని మిస్ చేసుకున్నారు. ఒకవేళ ఆయన కనక ఈ కాంతారా సినిమా చేసి ఉంటే మరింతగా దీనికి గొప్ప గుర్తింపు వచ్చుండేదని అంటున్నారు విశ్లేషకులు. 

కాంతారా సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ఉండాలని ముందుగానే అనుకున్నారట. అందుకోసమే హోంబలే ప్రొడక్షన్‌ హౌస్‌ను సంప్రదించాడు. అన్ని కుదిరిన తర్వాత పునీత్‌ రాజ్‌కుమార్‌తో సినిమా చేయాలని అనుకున్నాడట. అయితే ఇదే విషయం పునీత్‌ రాజ్‌కుమార్‌తో చెబితే.. ఆ మట్టి వాసన బాగా పండాలంటే.. హీరోగా నువ్వే నటించాలి అని సలహా ఇచ్చాడట. దాంతో రిషబ్ ఈ సినిమాలో హీరోగాను నటించాడట.