Asianet News TeluguAsianet News Telugu

థియోటర్స్ ఓపెన్ చేసారు, దుల్కర్‌ సినిమా రీ రిలీజ్

ఓకే బంగారం, మహానటి వంటి సినిమాలతో తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న దుల్కర్‌ తన 25వ చిత్రానికి పూర్తిగా డిఫరెంట్‌ కథను ఎంచుకున్నాడు. పిబ్రవరిలో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే విడుదలైన కొన్నిరోజులకే కరోనా వైరస్‌ విజృంభిస్తోండడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ మంది చూడలేదు.ఆంటోని జోసెఫ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తాజాగా రీరిలీజ్‌ చేశారు.

Dulquer Salman  film Kannum Kannum Kollaiyadithaal re released
Author
Hyderabad, First Published May 29, 2020, 8:46 AM IST


 
దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నూతన దర్శకుడు దేసింగ్‌ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. ఓకే బంగారం, మహానటి వంటి సినిమాలతో తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న దుల్కర్‌ తన 25వ చిత్రానికి పూర్తిగా డిఫరెంట్‌ కథను ఎంచుకున్నాడు. పిబ్రవరిలో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే విడుదలైన కొన్నిరోజులకే కరోనా వైరస్‌ విజృంభిస్తోండడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ మంది చూడలేదు.ఆంటోని జోసెఫ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తాజాగా రీరిలీజ్‌ చేశారు.

 లాక్‌డౌన్‌ తర్వాత ఇటీవల దుబాయ్‌లో థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. థియేటర్లలో పాటించాల్సిన రూల్స్ గురించి అక్కడి ప్రభుత్వం వివరించి,అనేక జాగ్రత్తలతో థియోటర్లు వదిలారు. ఈ నేపథ్యంలో మే 27 నుంచి ‘కనులు కనులను..’ చిత్రాన్ని అక్కడి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ దుల్కర్‌ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. చాలా రోజుల తర్వాత థియేటర్లలో సినిమా సందడి చేయడం చూస్తుంటే తనకెంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గౌతమ్‌ మేనన్‌ ఓ కీలకపాత్రను పోషించారు. 

‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్‌ పాత్రలో మెప్పించిన దుల్కర్‌.. ఈ సినిమాలో సిద్దార్థ్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు.  ఇక తెలుగమ్మాయి రీతు వర్మకు ఈ సినిమాలో మంచి క్యారెక్టరే లభించింది. డిఫరెంట్‌ షేడ్స్‌లో కనిపించి మెప్పించింది. కథ, కథనం కొత్తగా, డిఫరెంట్‌గా ఉండటమే కలిసొచ్చింది. కథను ఇంట్రస్టింగ్ గా ప్రారంభించాడు దర్శకుడు. అన్‌లైన్‌ మోసాలు, దొంగతనాలుతో సినిమా బాగుంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios