ఆ హీరోని మరిచింది.. దుమ్మెత్తిపొస్తున్న నెటిజన్లు

ఆ హీరోని మరిచింది.. దుమ్మెత్తిపొస్తున్న నెటిజన్లు

మొన్నటి వరకు టాలీవడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గాయి. కానీ యువతలో మాత్రం రకుల్ కు మంచి క్రేజ్ ఉంది. టాలీవడో లో చాలామంది స్టార్ హీరోగా సరసన రకుల్ నటించింది. తాజగా రకుల్ ప్రీత్ సింగ్ టార్గెట్ గా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మహానటి చిత్రం విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన చిన్న పొరపాటే దీనికి కారణం. మహానటి చిత్రం విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.రకుల్ ప్రీత్ సింగ్ టాలీవడ్ లో క్రేజీ హీరోయిన్ గా బడా హీరోల సరసన నటించింది. మొన్నటివరకు జోరుమీదున్న రకుల్ సినీ కెరీర్ ఇప్పుడు బాగా తగ్గింది. రకుల్ కు అవకాశాలు కరువయ్యాయి.

ఇటీవల విడుదలైన మహానటి చిత్రంపై సెలెబ్రిటీలంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో మహానటి చిత్రం గురించి తమ అభిప్రాయాలు తెలియజేస్తూ కీర్తి సురేష్ సహా ఇతర నటీనటులని ప్రశంసిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా మహానటి చిత్రం చూసి తన అభిప్రాయాన్ని తెలిపింది.మహానటి చిత్రం మాస్టర్ పీస్ అంటూ ప్రశంసించింది. కీర్తి సురేష్ నటనతో అదరగొట్టిందని తెలిపింది. సమంత, విజయ్ దేవరకొండ కూడా చాలా బాగా నటించారని రకుల్ ప్రశంసించింది. కానీ ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషించిన మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ని మాత్రం మరచిపోయింది. అందరి గురించి ప్రస్తావించిన రకుల్.. దుల్కర్ సల్మాన్ ని మరచిపోవడంతో విమర్శలు చెలరేగుతున్నాయి. దుల్కర్ ఫాన్స్ రకుల్ టార్గెట్ గా కామెంట్స్ పెడుతున్నారు. దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో జెమినీగణేశన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.


 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page