రిలీజ్ అయ్యి దగ్గరగా నెలరోజులు కావస్తున్నా.. సీతారామం దూకుడు మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. ఇక్కడంటే సినిమా బాగా నచ్చింది.. మనవాళ్లకు కనెక్ట్ అయ్యింది అనుకోవచ్చు.. కాని యూస్ ఎస్ లో కూడా సీతారామం ఇంకా రచ్చ రచ్చ చేస్తోంది.
దూకుడు చూపిస్తున్నాడు దుల్కర్ సల్మాన్ .. టాలీవుడ్ లో హీరోగా నిరూపించుకోవాలి అనుకున్నాడు.. అది సాధించాడు. మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా.. మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా సీతారామం. హనూరాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అశ్వనీదత్ నిర్మించారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా.. మొదటి రోజు నుంచే రచ్చ మొదలు పెట్టింది.
ఫీల్ గుడ్ మూవీగా రిలీజ్ అయిన ఈ ప్రేమ కథకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. తెలుగు, తమిళ్ లోనే కాకుండా.. యూఎస్ లోను ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. క్లాసికల్ హిట్ అనిపించుకుని అందరిని ఆశ్చర్య పరిచింది. ఇక ఇక్కడికంటే ఎక్కువగా యూఎస్ లో ఈ సినిమా అంచనాలకి మించిన ఆదరణను సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకూ సీతారామం సినిమా యూఎస్ లో 1.35 మిలియన్ డాలర్స్ ను మించికలెక్షన్స్ ను రాబట్టుకుంది. త్వరలోనే 1.5 మిలియన్ మార్కును టచ్ చేయవచ్చని సినీ జనాలు అభిప్రాయ పడుతుననారు. అంతాలా అక్కడ సీతారామం సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈసినిమాకు కథ ఎంత ప్రాణం పోసిందో.. అంతకు మించి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. కథకు తగ్గట్టు వచ్చే పాటులు పులకరింపచేశాయి.
ఇక తెలుగు హీరో అనిపంచుకుంటున్నాడు మలయాళ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో దుల్కర్. ఇక్కడ వరుసగా ఆఫర్స్ వస్తుండటంతో.. నెక్ట్స్ కూడా తెలుగు డైరెక్ట్ మూవీ చేయాలని అనుకుంటున్నాడట స్టార్ హీరో. అటు టీవీనటిగా కెరీర్ స్టార్ట్ చేసి.. టాలీవుడ్ లో ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టిన మృనాళ్ ఠాకూర్ కు కూడా అవకాశాలు వెల్లువలా వస్తున్నాయట. అందుకే రీసెంట్ గా రెమ్యూనరేషన్ కూడా పెంచిందట. బ్యూటీ.
